AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine Price: కోవిడ్ వ్యాక్సిన్ ఇక మరింత విరివిగా.. ధర నిర్ణయించిన సర్కార్.. ప్రైవేటులో గరిష్టంగా రూ.250..!

మార్చి 1వ తేదీ నుంచి పెద్ద ఎత్తున చేపట్టనున్న రెండో దశ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ధరను ఖరారు చేసింది ప్రభుత్వం. 60 ఏళ్ళకు పైబడి వారితోపాటు 45 ఏళ్ళు దాటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి...

Covid Vaccine Price: కోవిడ్ వ్యాక్సిన్ ఇక మరింత విరివిగా.. ధర నిర్ణయించిన సర్కార్.. ప్రైవేటులో గరిష్టంగా రూ.250..!
Rajesh Sharma
| Edited By: |

Updated on: Feb 28, 2021 | 10:48 AM

Share

Government confirmed corona vaccine price: మార్చి 1వ తేదీ నుంచి పెద్ద ఎత్తున చేపట్టనున్న రెండో దశ కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి ధరను ఖరారు చేసింది ప్రభుత్వం. 60 ఏళ్లకు పైబడి వారితోపాటు 45 ఏళ్ళు దాటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రెండో దశలో వ్యాక్సిన్ వేయబోతున్నారు. పది వేల ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగాను.. 20 వేల ప్రైవేటు ల్యాబులు, ఆసుపత్రుల్లో కొద్ది పాటి ధర చెల్లింపుతోను కరోనా వైరస్ పంపిణ జరగబోతోంది. అయితే ప్రైవేటులో వేసే కరోనా వ్యాక్సిన్ ధరపై రకరకాల ఊహాగానాలు కొనసాగాయి. ఈ ధర 500 రూపాయల వరకు వుండే ఛాన్సుందని పెద్ద ఎత్తున కథనాలు మీడియాలో వచ్చాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్ ధరను కన్‌ఫర్మ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మన దేశంలో 20 వేల ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబుల్లో పంపిణీ చేయనున్న కరోనా వ్యాక్సిన్ ధరను 250 రూపాయలుగా ఖరారు చేశారు. అన్ని సర్వీసు ఛార్జీలను కలుపుకుని గరిష్టంగా రూ.250గా నిర్ణయించారు. అంతకు మించి వసూలు చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. మార్చి ఒకటవ తేదీ నుంచి పబ్లిక్ డొమైన్‌లోకి కోవిడ్ వ్యాక్సిన్ చేరబోతోంది. కోవిన్ సాఫ్ట్‌వేర్ ద్వారానే వ్యాక్సిన్ పంపిణీ జరగబోతోంది. దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు హాస్పిటళ్ళలో వ్యాక్సిన్ పంపిణీ జరగబోతుండగా.. తెలంగాణలోని 1200 కేంద్రాల్లో 60 ఏళ్ళు దాటిన వారికి, 45 ఏళ్ళు దాటి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడేవారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కొక్కరు రెండు డోసులు వేసుకోవాల్సి వుండగా.. మొత్తం 500 రూపాయలు ప్రైవేటు హాస్పిటళ్ళలో చెల్లించాల్సి వుంటుంది. అయితే ఈ చెల్లింపు ఏ డోసుకు ఆ డోసు సెపరేటుగానే చెల్లించాల్సి వుంటుందని తెలుస్తోంది.

రెండో విడత వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఆయుష్మాన్ భారత్ కింద 10 వేల ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ కింద మరో 687 ఆసుపత్రుల్లోను కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాలను ఎంపిక చేసే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది కేంద్రం. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వం రంగ సంస్థల ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టబోతున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చినా.. రెండు డోసులు పూర్తయిన తర్వాత కూడా నెల రోజుల పాటు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రజలకు సూచించారు.

కాగా, ఇప్పటి వరకు తొలి విడత కరోనా వ్యాక్సిన్ పంపిణీలో కోటి 38 లక్షల మందికి టీకాలు వేసినట్లు కేంద్రం ప్రకటించింది. రెండు లక్షల 89 వేల సెషన్లు నిర్వహించిన వైద్య సిబ్బంది 66 లక్షల 37 వేల 320 మంది హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయగా.. మొత్తం హెల్త్ కేర్ సిబ్బందిలో ఇది 77 శాతంగా చెబుతున్నారు. 49 లక్షల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ మొదటి డోసు వేశారు. కోవాక్సిన్, కోవీ షిల్డ్ అనే రెండు రకాల వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా జనవరి 16వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే.

ALSO READ: భద్రతా దళాల తరలింపుపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం..

ALSO READ: ఇండియాకు అమెరికా అప్పు.. కీలక సమాచారాన్ని వెల్లడించిన అమెరికన్ మెంబర్

ALSO READ: అయిదు అసెంబ్లీల ఎన్నికలు.. ఏ లెక్కన చూసినా అన్ని పార్టీలకు కీలకమే

ALSO READ: సోషల్ మీడియా, ఓటీటీ చట్టంలో కొత్త మార్గదర్శకాలు.. కొత్త నిబంధనలను ఎందుకోసం? ఎవరికోసం?