New IT Act 2021: సోషల్ మీడియా, ఓటీటీ చట్టంలో కొత్త మార్గదర్శకాలు.. కొత్త నిబంధనలను ఎందుకోసం? ఎవరికోసం?

సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కంటెంట్‌పై కేంద్ర కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే.. ఇందుకు దారి తీసిన పరిస్థితులేంటి? ఏరకమైన ఉదంతాలను పరిగణలోకి తీసుకుని కేంద్రం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. అసలిందుకు దారి తీసిన నేపథ్యమేంటి?

New IT Act 2021: సోషల్ మీడియా, ఓటీటీ చట్టంలో కొత్త మార్గదర్శకాలు.. కొత్త నిబంధనలను ఎందుకోసం? ఎవరికోసం?
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 27, 2021 | 1:59 PM

New guidelines for social media and OTT platforms: సోషల్ మీడియాతోపాటు ఓటీటీ ప్లాట్ (ఓవర్ ది టాప్) ఫామ్స్‌పై నియంత్రణ కోసం కేంద్ర చర్యలకు ఉపక్రమించింది. వాటి నియంత్రణలకు పక్కా మార్గదర్శకాలను రూపొందించింది. వాటిని ఫిబ్రవరి 26వ తేదీన విడుదల కూడా చేసింది. నిజానికి ఈ అంశం చాలా కాలంగా చర్చల్లో నానుతోంది. సినిమాలకు సెన్సార్ బోర్డు వుంది కానీ అవే సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై విడుదల చేసే ఎలాంటి నియంత్రణ లేదు. సినిమాలలో సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పిన సీన్లను యాడ్ చేసి.. లేదా అసలు సెన్సార్ బోర్డు ముందుకే పంపని క్లిప్పిగులను యాడ్ చేసి మరీ ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌పై విడుదల చేయడం రివాజుగా మారింది.

అటు సోషల్ మీడియాకైతే పట్టపగ్గాల్లేవనే చెప్పాలి. తమకు నచ్చిన ఏదైనా పోస్టును.. ఎక్కువగా భావోద్వేగాలను రెచ్చగొట్టే హేట్ స్పీచులను పోస్టు చేయడం తప్పించుకు తిరగడం అలవాటై పోయింది చాలా మంది. ఈవిధంగా చేసిన ఓ ప్రబుద్ధుడు కొన్ని నెలల తర్వాత దుబాయ్ నుంచి రాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం అరెస్టు చేశారు. తాజాగా కేంద్ర సోషల్ మీడియాపైనా.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పైనా నియంత్రణ కోసం కొన్ని మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నేపథ్యం, దాంట్లో పోస్టయిన కొన్ని వివాదాస్పద అంశాలు ఎలా వైరల్‌గా మారి ఎవరికి ఇబ్బందికరంగా పరిణమించాయో చూద్దాం.

2012లో శివసేన అధినేత బాల్ థాక్రే మృతిపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు దర్శనమిచ్చాయి. ఫేస్ బుక్ ఖాతాలో అభ్యంతకరమైన పోస్టులు పెట్టారని ఇద్దరు అమ్మాయిలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అజంఖాన్ అనే రాజకీయ నేతపై అభ్యంతకర రీతిలో పోస్టులు దర్శనమిచ్చాయి. ఐటీ-2000 చట్టంలోని సెక్షన్ 66ఎకు వ్యతిరేకంగా నెటిజన్లు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 2017 జూన్ 27వ తేదీన సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై సుప్రీంకోర్టు ఓ తీర్పునిచ్చింది. ఐటీ-2000 చట్టంలోని సెక్షన్ 66ఎ ప్రాథమిక హక్కులను ఉల్లంఘనలపై జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ‘‘ సెక్షన్-66A ద్వారా పౌరుల ఆలోచనా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై నేరుగా ప్రభావం పడుతుంది.. ఒక వ్యక్తికి అభ్యంతరకరమైంది, మరో వ్యక్తికి అభ్యంతరకరం కాకపోవచ్చు.. మన రాజ్యాంగం.. పౌరులకు స్వేచ్ఛ, ఆలోచనలను వ్యక్తీకరించే హక్కును ప్రసాదించింది. వీటికి భంగం వాటిల్లేవిధంగా ఎలాంటి నిబంధనలను అంగీకరించేది లేదు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దాంతో సోషల్ మీడియాలో పోస్టులపై కాస్త కన్ఫ్యూజన్ జనరేట్ అయ్యింది. ఎవరు ఎవరికి నచ్చింది.. తోచింది వారు పోస్టు చేస్తే అది ఇంకొకరికి అభ్యంతరకరమైనది అయితే.. ఎవరి మనోభావాలను మొదటి ప్రాధాన్యత నివ్వాలి? ఇదో పెద్ద ప్రశ్నగా మారింది. అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పోస్టు చేసిన వారి హక్కు అయితే.. ఆ పోస్టు వల్ల మనోభావాలు దెబ్బతిన్న వారి హక్కు పరిస్థితి ఏంటి? ఇలాంటి చర్చలు గత దశాబ్ధ కాలంగా పలు సందర్భాలలో వినిపించాయి.. టీవీ చర్చల్లో కనిపించీ వినిపించాయి.

తాజాగా నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు కొనసాగిస్తున్న ఆందోళన నేపథ్యంలో.. సామాజిక మాధ్యమం ట్విటర్‌లో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం ఊపందుకోవడంతో కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించింది. సుప్రీకోర్టు తీర్పు నేపథ్యంలో సోషల్ మీడియా స్వేచ్ఛపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఆ తర్వాత ఐటీ చట్టం 2021 ముసాయిదాను 2018 డిసెంబర్ 24న విడుదల చేశారు. ముసాయిదాలోని 171, 80 సూచనలను పరిగణనలోకి తీసుకొని తాజాగా మార్గదర్శకాలు విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేయకుండా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 (గైడ్ లైన్స్ ఫర్ ఇంటర్మీడియరీస్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ట్విటర్, ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు సహా ఓటీటీ వేదికలైన యూ ట్యూబ్, నెట్ ఫ్లిక్స్ తదితరాలు స్వీయ ఐటీ-2021 మార్గ నిర్దేశకాలను విధిగా పాటించాలి. స్వీయ నియంత్రణ పాటించాల్సి వుంటుంది. సోషల్ మీడియా వేదికలు, ఓటీటీలు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. మూడు అంచెల నియంత్రణ విధానం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు.

ఓటిటి (ఓవర్ ది టాప్)లో అసభ్య, అశ్లీల, హింసాత్మక అంశాలకు సంబంధించిన కంటెంట్‌పై నిషేధం విధించారు. ఓటీటీలో ప్రసారం అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ కంటెంట్‌ను వయస్సు ఆధారంగా 5 విభాగాలుగా విభజన చేశారు. సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే కంటెంట్‌పై నిషేధం కొనసాగుతుంది. జాతి సమగ్రత, సమైక్యతను దెబ్బతీసేలా ఉండే అంశాలపై నిషేధం కొనసాగిస్తారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌పై కఠిన ఆంక్షలు విధించారు. మహిళలు, చిన్నారులు, దళితులను కించపరిచేలా ఉండే అంశాలపై నిషేధం విధించారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలను ప్రతిపాదించారు. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఫేక్ న్యూస్‌ను సైట్స్, సోషల్ మీడియాలోంచి తొలగించాలి. ఇలాంటి వాటిపై వచ్చే ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించే అధికారులు 24 గంటలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలని మార్గనిర్దేశకాలలో పేర్కొన్నారు.

ఓటీటీ, డిజిటల్ ఫ్లాట్‌ఫాంలపై విడుదలయ్యే సినిమాల కట్టడి చేయాలని ప్రతిపాదించారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యే ఫేక్ న్యూస్‌పై ఉక్కుపాదం మోపే సంకేతాలు తాజా ఆంక్షల్లో కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాను దుర్వినియోగం చేయకుండా కొత్త నిబంధనలు రూపొందాయి. అభ్యంతరకర పోస్టులను తక్షణం గుర్తించేలా చర్యలు చేపట్టారు. అశాంతిని, అవాస్తవాలను కొన్నిసార్లు సోషల్ మీడియా ప్రచారం చేస్తోందనే వాదన గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇతరుల గౌరవాన్ని దెబ్బతీసే సోషల్ మీడియా రాతలకు అడ్డుకట్ట వేయాలని కేంద్ర సంకల్పించింది. అసత్య, దుష్ప్రచారాలను అడ్డుకునేలా నియంత్రణ అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా మూడు నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.

తాజా నిబంధనల్లో కీలకాంశాలు:

# సోష‌ల్ మీడియా సంస్థ‌లు ఖ‌చ్చితంగా త‌మ అధికారుల‌ను భార‌త్‌లో నియ‌మించాలి # భార‌త్‌లో వారి కార్యాల‌యాల‌ను ఏర్పాటు చేయాలి # ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించే అధికారం కూడా దేశంలోనే ఉండాలి # ఫిర్యాదులను నిర్ణీత కాలంలో పరిష్కరించాలి # సోషల్ మీడియా సైట్లు పోస్టులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి # అసభ్య, అసత్య పోస్టులు ఎవరు పెడుతున్నారో గుర్తించే బాధ్యత ఆయా సంస్థలదే # ఫిర్యాదులను పరిష్కరించే అధికారులు 24 గంటలు దర్యాప్తు సంస్థలకు అందుబాటులో ఉండాలి

ALSO READ: అన్నీ ఓకే గానీ.. బెంగాల్‌పైనే స్పెషల్ ఫోకస్.. ఎందుకంటే?

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!