Covid Vaccine: సీనియర్ సిటిజెన్స్ కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఇలా రిజస్ట్రేషన్ చేసుకోండి.. ఎప్పటి నుంచి ప్రారంభమంటే..
Covid Vaccine: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా..
Covid Vaccine: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుతోంది. భారత్‌లో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌తో పాటు.. భారత్ బయోటిక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్లతో పాటు, హెల్త్ వర్కర్లకు టీకా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో ఇప్పుడు దేశంలోని వయోవృద్ధులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న 45 ఏళ్లు అంతకుమించి వయసున్న వారితో పాటు.. 60 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు అర్హులైన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే..
కొ-విన్ పోర్టల్ ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ నమోదు చేస్తే.. పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఇక ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌కు వన్ టైం పాస్‌వర్డ్ వస్తుంది. దానిని ఎంటర్ చేసి.. ఫోటో ఐడీ కార్డు అప్‌లోడ్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. అయితే ఒకవేళ మీ ఆధార్ కార్డుపై చిరునామా, పుట్టిన తేదీ లేకపోతే.. వాటిని మీరు స్వయంగా ఎంటర్ చేయవచ్చు. వివరాలన్నీ నమోదు చేసుకున్న తర్వాత ‘డెమో అథెంటికేషన్’ అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. అన్ని కరెక్ట్ ఉంటే గ్రీన్ టిక్‌తో రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్లు చూపిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత టీకా ఎప్పుడు.? ఎక్కడ వేస్తారన్న వివరాలు మొబైల్ నెంబర్‌కు వస్తాయి.