Co-WIN 2.0: కరోనా టీకా కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ అవసరం? పూర్తి వివరాలు మీ కోసం
మార్చి 1 నుండి రెండవ దశ కరోనా టీకాలు వేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ దశలో, 60 ఏళ్లు పైబడిన వారికి, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.
మార్చి 1 నుండి రెండవ దశ కరోనా టీకాలు వేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ దశలో, 60 ఏళ్లు పైబడిన వారికి, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన పోర్టల్ కో-విన్ 2.0 ద్వారా టీకాలు వేయడానికి లబ్ధిదారులు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుందని చెప్పారు.
కో-విన్ 2.0 యొక్క ఫీచర్స్ ఏమిటి?
కో-విన్ 2.0 లో కొన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి మార్చి 1 నుండి లబ్ధిదారులకు తమ పేర్లు నమోదు చేసుకోవడానికి సహాయపడతాయి. కో-విన్ 2.0 ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం..
- కోవిన్ యాప్ కొత్త వెర్షన్ జీపీఎస్ సెట్టింగ్స్‌తో అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది.
- టీకా కోసం మీరే నమోదు చేసుకోవడానికి వాక్-ఇన్-ప్రొవిజన్ కూడా ఉంటుంది. ఇందులో, ప్రజలకు సెషన్ సైట్‌లో నమోదు చేసుకునే సదుపాయం కల్పిస్తారు.
- ఒక వ్యక్తి ఒక మొబైల్ ఫోన్‌లో నాలుగు అపాయింట్‌మెంట్లు చేయవచ్చు.
- వ్యాక్సిన్‌ను ఎంచుకోవడానికి ఆప్షన్ ఉండదు..కానీ డేట్, సెంటర్ ఎంచుకోవడానికి ఆప్షన్ ఉంటుంది
ఒక వ్యక్తి కో-విన్ 2.0 లో ఎలా నమోదు చేసుకోవచ్చు?
కో-విన్ 2.0 లో నమోదు చేయడానికి, ఒక వ్యక్తి అనుసరించాల్సిన సింపుల్ స్టెప్స్ ఇప్పుడు చూద్దాం..
స్టెప్ 1: cowin.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
స్టెప్ 2: మీరే నమోదు చేసుకోవడానికి మీ 10 అంకెల మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
స్టెప్ 3: నంబర్ నమోదు చేసిన తర్వాత, మీకు ఓటీపీ వస్తుంది.. దాన్ని సబ్మిట్ చేయాలి
స్టెప్ 4: మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, షెడ్యూల్ చేసిన సమయానికి టీకా వేయించుకోండి
స్టెప్ 5: దీని తరువాత, మీకు టీకా ధృవీకరణ పత్రాన్ని పొందగల రిఫరెన్స్ ఐడి వస్తుంది..
కో-విన్ 2.0 రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటి?
- 45 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు..వారి పరిస్థితిని ప్రస్తావిస్తూ వైద్య ధృవీకరణ పత్రాన్ని అప్‌లోడ్ చేయాలి.
- 60 ఏళ్లు పైబడిన వారికి, టీకా ప్రక్రియ కోసం వారు తమ ఆధార్ కార్డు లేదా ఓటరు ఐడి కార్డు లేదా ఫోటో ఐడి కార్డును తీసుకెళ్లాలి.
టీకా ప్రక్రియకు ఛార్జీ ఎంత?
ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగానే టీకాలు వేస్తారు. ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలలో టీకా ప్రక్రియకు వెళ్ళేవాళ్లు “ప్రీ-ఫిక్స్డ్ ఛార్జ్” చెల్లించాలి. వ్యాక్సినేషన్ ప్రక్రియమార్చి 1 నుండి 10,000 ప్రభుత్వ కేంద్రాలలో, 20,000 కి పైగా ప్రైవేట్ కేంద్రాలలో జరుగుతుంది.
Also Read:
Crime News: ఎన్నారైలే టార్గెట్… నెల్లూరు నుంచే ఆపరేషన్… ప్రొఫైల్‌లో అందమైన ఫొటోలు… గొంతు మార్చి..