AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal Polls:’మే 2 న నా చివరి ట్వీట్ చూడండి,’ టీఎంసీ స్లోగన్ తో ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

West Bengal Polls:ఇండియాలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కీలక పోరాటాల్లో ఒకటైన పోరు వెస్ట్ బెంగాల్ లో జరగనుందని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు.

West Bengal Polls:'మే 2 న నా చివరి ట్వీట్ చూడండి,' టీఎంసీ స్లోగన్ తో ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
Umakanth Rao
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Feb 27, 2021 | 4:49 PM

Share

West Bengal Polls:ఇండియాలో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న కీలక పోరాటాల్లో ఒకటైన పోరు వెస్ట్ బెంగాల్ లో జరగనుందని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. సరైన మెసేజ్ ఇవ్వడానికి, మార్గాన్ని చూపడానికి బెంగాల్ ప్రజలు సిధ్దంగా ఉన్నారని ఆయన ట్వీట్ చేశారు. పైగా బెంగాల్ కి తమ సొంత కూతురే కావాలన్న తృణమూల్ కాంగ్రెస్ నినాదాన్ని కూడా ఆయన తన ట్వీట్ కి జోడించారు. మే 2 న నా చివరి ట్వీట్ చూస్తారు అని పేర్కొన్నారు. అంటే ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయమే ఖాయమని పరోక్షంగా అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. ఫలితాలు మే 2 న ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఇది సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్.  మార్చి 27, ఏప్రిల్ 1, ఎప్రిల్ 6, ఏప్రిల్ 10, ఏప్రిల్ 17, ఏప్రిల్ 22, 29 న ఎన్నికలు జరుగుతాయి. 2016 లో ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఏప్రిల్-మే మధ్య ఏడు రోజుల్లో సుమారు ఆరున్నర కోట్ల మంది ఓటర్లు  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా- తమ రాష్ట్రానికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ తేదీలను సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. 240 సీట్లున్న బీహార్ రాష్ట్రంలో మూడు దశల్లో ఎన్నికలు జరిగాయని, 234 సీట్లున్న తమిళనాడులో ఒకే రోజున ఎన్నికలు జరగనున్నాయని ఆమె అన్నారు. అలాంటప్పుడు మా రాష్ట్రంలో ఎనిమిది దశలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. దీనివల్ల ఎవరికి లాభమని, ఇది బీజేపీ సూచనే అని ఆమె దుయ్యబట్టారు. మా శాసన సభలో 294 సీట్లు ఉన్నాయని,  ఇన్ని దశల్లో ఎందుకు జరగాలని ప్రశ్నించిన ఆమె.. నరేంద్ర మోదీ, అమిత్ షా ఆదేశాలతోనే ఎన్నికల కమిషన్ ఈ తేదీలను ప్రకటించిందా అన్నారు. ఈ నిర్ణయం వెనుక ఏదైనా సహేతుకత ఉండాలన్నారు. మేం బలంగా ఉన్న దక్షిణ 24 పరగణాల జిల్లాలో మూడు దశల ఎన్నికలు ఎందుకని కూడా మమత ప్రశ్నించారు. అయితే బీజేపీ వారి ఈ కుట్రలన్నీ తమకు తెలుసునని, వాటిని తిప్పికొడతామని ఆమె హెచ్చరించారు. అయితే లెఫ్ట్ పార్టీలు, కాంగ్రెస్ ఈసీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో 8 దశల్లో ఎన్నికలు నిర్వహించడం సబబే అని పేర్కొన్నాయి.   అటు-ఇలా ఇన్ని దశల్లో పోల్స్ నిర్వహించడం మంచి నిర్ణయమని బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయ వ్యాఖ్యానించారు. టీఎంసీ కార్యకర్తల దాడులను నివారించడానికి, ఎక్కువ సంఖ్యలో పోలీసు,  పారా బలగాలను నియమించడానికి ఈసీ నిర్ణయం దోహదపడుతుందన్నారు.

Read More:

ఎగ్జామ్స్ ఉన్నాయా..? అయితే మీ పిల్లలకు ఇలాంటి ఆహారమివ్వండి..

Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త