Wing Commander Abhinandan: ఫోన్ కాల్, రహస్య లేఖ వల్లే పాకిస్థాన్ భారత పైలట్ అభినందన్ వర్ధమాన్‌ను వదిలేశారు
Wing Commander Abhinandan: 2019 ఫిబ్రవరి నెలలో భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయన నడుపుతున్న..
Wing Commander Abhinandan: 2019 ఫిబ్రవరి నెలలో భారత పైలట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్థాన్ ఆర్మీ చేతికి చిక్కిన విషయం తెలిసిందే. అయితే ఆయన నడుపుతున్న మిగ్-21 యుద్ధ విమానం కూలిపోవడంతో పారాచూట్ సాయంతో పాక్ భూభాగంలో దిగి పాక్ ఆర్మికి చిక్కారు. దాదాపు 60 గంటల పాటు నిర్భంధంలో ఉంచి జనీవా ఒప్పందం ప్రకారం పాక్ అభినందన్‌ను విడిచిపెట్టింది. అప్పట్లో అభిందన్ ఘటన తీవ్ర సంచలనం రేపింది. అయితే అభినందన్‌ను వదిలేయడానికి ఓ ప్రత్యేక కారణంగా ఉంది. ఆయన పాకిస్థాన్ చెరలో ఉన్న సమయంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) చీఫ్ అనిల్ ధస్‌మనా పాక్‌ను గట్టిగా హెచ్చరించారు. అభినందన్ వర్ధమాన్‌కు ఏమైనా జరిగినట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇక భారత ప్రధాని నరేంద్రమోదీ సూచనల మేరకు.. ఐఎస్‌ఐ కౌంటర్ పార్ట్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ సయ్యద్ అసిమ్ మునిర్ అహ్మద్ షాకు రేర్ ఫోన్ కాల్, రహస్య లేఖ ద్వారా ఈ హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం చోటు చేసుకున్న మరికొన్ని పరిణామాలతో పాక్ వెనక్కి తగ్గి అభినందన్‌ను వదిలిపెట్టడానికి నిశ్చయించుకుంది. 2019 ఫిబ్రవరి 28న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత సైనికులను వదిలేస్తున్నట్లు నేషనల్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే ఆ సమయంలో అభినందన్ వర్ధమాన్ రాక పట్ల భారత వైమానిక దళం హర్షం వ్యక్తం చేసింది. అభినందన్ తిరిగి రావడంతో వేడుక జరుపుకొన్నారు. ఆ తరువాత వైమానిక దళ విమానంలో ఆయనను రాత్రి దాదాపు 12 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. వింగ్ కమాండర్ అభినందన్ భారత్ స్వదేశాగమనం సందర్భంగా వాఘా-అటారీ సరిహద్దు వద్దనే కాకుండా దేశంలో చాలా చోట్ల ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.
కాగా, అభినందన్ విడుదలలో ఆలస్యం జరిగింది. ముందుగా అదే రోజు సాయంత్రం ఆయనను భారత అధికారులకు అప్పగించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అనంతరం ఇమిగ్రేషన్ ప్రక్రియలో ఆలస్యం కారణంగా రాత్రి 9 గంటలకు అప్పగిస్తారని వెల్లడించారు. చివరకు రాత్రి 9 గంటల తర్వాత అప్పగింతల ప్రక్రియను పూర్తయి అభినందన్ పాక్ సరిహద్దు గేట్లను దాటగా భారత సైనికాధికారులు ఆయనను తోడ్కొని భారత్‌లోకి తీసుకువచ్చారు. ఆ ప్రాంతమంతా భారత్ అనుకూల నినాదాలతో మార్మోగింది.
అయితే రెండు రోజుల తర్వాత స్వదేశానికి వింగ్ కమాండర్ అభినందన్ ఫిబ్రవరి 27న పాకిస్థాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. భారత వైమానిక దళం అధికారులు తెలిపిన దాని ప్రకారం.. ఫిబ్రవరి 27న ఉదయం 10 గంటల ప్రాంతంలో పాక్ విమానాలు భారత గగనతలంలోకి వచ్చినట్లు రాడార్ సంకేతాలు అందాయి. ఆ విమానాలను తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళం మిగ్ -21 బైసన్, సుఖోయి 30 ఎంఏకేఐ, మిరాజ్ 2000 యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది. ఆ ప్రయత్నంలో మిగ్ -21 యుద్ధ విమానం కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటకు రాగలిగారు. కానీ ఆయన పారాచూట్ పాకిస్థాన్ పాలిత కశ్మీర్ భూభాగంలో పడింది. దాంతో పాకిస్థాన్ సైన్యం ఆయనను అదుపులోకి తీసుకుంది.