AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine:ఫ్రీ కాదు, ప్రైవేటు హాస్పిటల్స్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసు 250 రూపాయలు ? ఫిక్స్డ్ ప్రైస్

Covid Vaccine: కరోనా వైరస్ వ్యాక్సిన్ ని ప్రైవేటు హాస్పిటల్స్ లో డోసు 250 రూపాయలకు ఇచ్ఛే సూచనలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే ఇస్తున్నప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో..

Covid Vaccine:ఫ్రీ కాదు, ప్రైవేటు హాస్పిటల్స్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసు 250 రూపాయలు ? ఫిక్స్డ్ ప్రైస్
Umakanth Rao
| Edited By: Balaraju Goud|

Updated on: Feb 28, 2021 | 10:20 AM

Share

Covid Vaccine: కరోనా వైరస్ వ్యాక్సిన్ ని ప్రైవేటు హాస్పిటల్స్ లో డోసు 250 రూపాయలకు ఇచ్ఛే సూచనలున్నాయని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే ఇస్తున్నప్పటికే ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఈ చార్జీని వసూలు చేయవచ్చు. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ రేపో, మాపో అధికారికంగా ప్రకటిస్తుందని అంటున్నారు. బహుశా ఇది ఫిక్స్డ్ ప్రైస్ అని సమాచారం. నిజానికి వ్యాక్సిన్ కి  ఎంతమేరకు ఛార్జ్ చేయాలన్న అంశంపై మూడు-నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఇటీవల తెలిపారు. తాము వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతోను, ఆస్పత్రులతోను చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రైవేటు హాస్పిటల్స్ లో డోసు అన్ని సర్వీస్ చార్జీలు కలుపుకుని రూ. 250 రూపాయలుగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు 1.37 కోట్ల మంది  హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకామందులు ఇఛ్చినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2,89,320 సెషన్స్ లో 1,37,56,940 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే ఇంకా చాలా,మంది తీసుకోవలసి ఉంది.ఇలా ఉండగా కోవిడ్ 19 గైడ్ లైన్స్ మార్చి 31 వరకు కొనసాగుతాయని హోమ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదివరకు మాదిరే ప్రజలు కోవిడ్ 19 పట్ల అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా గైడ్ లైన్స్ పాటించాలని సూచించింది.

రాహ్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సర్వేలెన్స్, కంటెయిన్మెంట్ ‘కమిషన్’ అన్నవి మార్చి 31 వరకు కొనసాగుతాయి.. ముఖ్యంగా కంటెంయిన్మెంట్ జోన్లను డీమార్కేట్ చేయాలనీ ఈ శాఖ కోరింది. ఈ నెల 26 నాటికీ ఇండియాలో 16,577 కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 120 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491 కి చేరింది. 1,56,825 మంది మృత్యు వాత పడ్డారు. ప్రజలకు మాస్క్ ధారణ తప్పనిసరని, ఒకే చోట ఎక్కువమంది గుమి కూడరాదని కేంద్రం, ఆరోగ్య శాఖ పదేపదే హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ సహా 5 రాష్ట్రాల్లో పెరిగిన కరోనా వైరస్ కేసులపై ఇవి ప్రధానంగా దృష్టి  పెట్టాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు నివారణకోసం ప్రజలు ప్రొటొకాల్స్ పాటిస్తే మళ్ళీ ఈ కేసుల సంఖ్యను తగ్గించవచ్చ్చునని భావిస్తున్నారు.

Read More:

Shocking News: ఇండియాకు అమెరికా అప్పు.. కీలక సమాచారాన్ని వెల్లడించిన అమెరికన్ మెంబర్.. మనకివ్వాల్సింది ఎంతంటే?

IRCTC Tirupati Tour: ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతికి.. ప్యాకేజీ వివరాలు