IRCTC Tirupati Tour: ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతికి.. ప్యాకేజీ వివరాలు

IRCTC Tirupati Tour: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త చెప్పింది ఆర్‌సీటీసీ టూరిజం. భక్తుల కోసం తిరుపతి టూర్‌ను ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి..

IRCTC Tirupati Tour: ఐఆర్‌సీటీసీ టూరిజం ప్యాకేజీ.. హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతికి.. ప్యాకేజీ వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Feb 27, 2021 | 5:18 PM

IRCTC Tirupati Tour: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు శుభవార్త చెప్పింది ఆర్‌సీటీసీ టూరిజం. భక్తుల కోసం తిరుపతి టూర్‌ను ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి విమానంలో తీసుకెళ్లి శ్రీవారి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కూడా చేస్తోంది. శ్రీవారి దర్శనంతో పాటు కాణిపాకం, శ్రీనివాస మంగాపురం, శ్రీ కాళహస్తి, తిరుచానూర్‌ ఆలయాలకు కూడా తీసుకెళ్లుంది. 2021 మార్చి 5, 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23 తేదీల్లో ఈ టూర్ మొదలవుతుందని టూరిజం తెలిపింది. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో బుకింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే తిరుమల టూర్‌ చేయాలనుకునే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తారు.

ప్యాకేజీ ప్రారంభ ధర:

అయితే ఈ తిరుపతి టూర్‌లో భాగంగా ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.10,820. ఇది ట్రిపుల్‌ ఆక్యునెన్సీ ధర. ఇక డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.10,920 కాగా, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.12,600. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్‌లో బస, వాహనంలో సైట్ సీయింగ్, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి కవర్ అవుతాయి.

టూర్‌ ప్యాకేజీ వివరాలు:

మొదటి రోజు : ఉదయం హైదరాబాద్‌లో విమానం ఎక్కితే గన్నవరం తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి విమానాశ్రం నుంచి హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్‌ ఇన్‌ అయిన తర్వాత కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాస మంగాపురం తీసుకెళ్తారు. సాయంత్రానికి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయాలి.

రెండో రోజు : ఇక రెండో రోజు తెల్లవారుజామున తిరుపతి శ్రీ వారి దర్శనానికి తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.ఆ తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. తర్వాత తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. ఆ తర్వాత తిరుపతి ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తారు. తిరుపతి ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే హైదరాబాద్‌ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

అయితే నేరుగా తిరుపతికి వచ్చే వారికి కూడా ఐఆర్‌సీటీసీ ఒక రోజు ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ ధర రూ.990 మాత్రమే. తిరుమల, తిరుచానూరు ఆలయాలు దర్శించుకోవచ్చు. తిరుమల, తిరుచానూరు ఆలయాల్లో ప్రత్యేక దర్శనం ఉంటుంది. డివైన్‌ బాలాజీ దర్శన్‌ పేరుతో ఈ ప్యాకేజీ ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌ సైట్‌లో ఉంటుంది. ఇలా భక్తులను ఉద్దేశించి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని ఏర్పాటు చేసింది. ఆసక్తిగల భక్తులు తిరుమల శ్రీవారిని ప్రత్యేకంగా దర్శించుకోవాలంటే ఈ వెబ్‌ సైట్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పూర్తి వివరాలు కావాలంటే వెబ్‌ సైట్‌ను సందర్శిస్తే తెలిసిపోతుంది.

Also Read: Wing Commander Abhinandan: ఫోన్‌ కాల్‌, రహస్య లేఖ వల్లే పాకిస్థాన్‌ భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను వదిలేశారు