AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD News: శ్రీవారి భక్తులకు షాకింగ్‌ న్యూస్‌.. వెంకన్న దర్శనార్థం వచ్చే భక్తులకు అదనపు భారం

శ్రీవారి భక్తులకు షాకింగ్‌ న్యూస్‌..వెంకన్న దర్శనార్థం వచ్చే భక్తులకు కొత్తగా మోతబరువు పడింది. అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు నిర్ణయించారు.

TTD News:  శ్రీవారి భక్తులకు షాకింగ్‌ న్యూస్‌.. వెంకన్న దర్శనార్థం వచ్చే భక్తులకు అదనపు భారం
TTD
Ram Naramaneni
|

Updated on: Feb 27, 2021 | 9:23 PM

Share

TTD News: శ్రీవారి భక్తులకు షాకింగ్‌ న్యూస్‌..వెంకన్న దర్శనార్థం వచ్చే భక్తులకు కొత్తగా మోతబరువు పడింది. అలిపిరి టోల్‌గేట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ మేరకు టీటీడీ అధికారులు నిర్ణయించారు. తిరుమలకు వెళ్లే వాహనాలన్నీ అలిపిరి వద్ద ఉన్న ఈ టోల్‌గేట్ మీదుగానే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రస్తుతం టోల్‌గేట్ వద్ద వసూలు చేస్తోన్న ఛార్జీలను టీటీడీ అధికారులు భారీగా పెంచారు.

సగటున రోజూ 10 వేలకు పైగా వాహనాలు ఈ టోల్‌గేట్ మీదుగా తిరుమలకు వెళ్తుంటాయి. ఆయా వాహనాల నుంచి టోల్ ఛార్జీలను వసూలు చేయడానికి అలిపిరి వద్ద టోల్‌గేట్‌ వ్యవస్థను ఏర్పాటుచేసి నామమాత్రంగా వాహనాల ఛార్జీలను వసూలు చేస్తుండేవారు. దశలవారీగా ఆ ఛార్జీలను పెంచుకుంటూ వచ్చారు. ఈ సారి భారీగా పెంచారు. ఇప్పటిదాకా కనిష్ఠంగా 15 రూపాయలు, గరిష్ఠంగా 100 రూపాయలను టోల్ ఛార్జీ కింద వసూలు చేసేవారు. ఇప్పుడిది రెట్టింపైంది. కనిష్ఠ ఛార్జీ 50 రూపాయలు, గరిష్ఠ చార్జీ 200 రూపాయలకు పెరిగింది. ఇప్పటిదాకా అమల్లో ఉన్న టోల్ ఛార్జీల ప్రకారం.. భక్తులు రాకపోకలు సాగించే వ్యక్తిగత కారుపై 15 రూపాయల నామమాత్రపు ఛార్జీని వసూలు చేసే వారు. ఇప్పుడు 50 రూపాయలకు పెంచారు. టాక్సీపై 25 రూపాయలు, సొంత జీపుపై వచ్చే వారి నుంచి 30 రూపాయలను తీసుకునే వారు.

ట్యాక్సీ, సుమో, ట్రాక్స్ వంటి కమర్షియల్ వాహనాలపై వచ్చే భక్తుల నుంచి 50 రూపాయల ఛార్జీని వసూలు చేస్తుండేవారు. హెచ్‌బీ మినీ లారీ-50, రాష్ట్ర పర్యాటకాభివ‌ద్ధి సంస్థకు చెందిన బస్సులపై గరిష్ఠంగా 100 రూపాయల ఛార్జీని విధించే వారు. ఇప్పడవన్నీ పెంచారు. శ్లాబులు, వాహనాలవారీగా టోల్‌గేట్ ఛార్జీలో పెరుగుదల నమోదైంది.

ఇక శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2021-22 సంవత్సరానికి 2వేల 937కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. టీటీడీ చైర్మ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన అన్నమయ్య భవన్ లో పాలకమండలి మీటింగ్‌ జరిగింది. 80 అంశాలను టీటీడీ పాలకమండలి సమావేశం చర్చించింది. టేబుల్ ఎజెండాగా మరిన్ని అంశాలు చర్చకు వచ్చాయి.సమావేశ వివరాలను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు ముందస్తు రిజర్వేషన్ తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏప్రిల్ 14వ తేదీ నుంచి భక్తులను శ్రీవారి ఆర్జిత సేవలకు అనుమతించాలని నిర్ణయించి నట్లు ఆయన వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులందరికీ కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించామన్నారు.

Also Read:

Coronavirus: ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. 28 జిల్లాల్లో సెకండ్ వేవ్ ఉధృతి.. తస్మాత్ జాగ్రత్త

Co-WIN 2.0: కరోనా టీకా కోసం ఎలా నమోదు చేసుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ అవసరం? పూర్తి వివరాలు మీ కోసం