AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hrithik Roshan vs Kangana Ranaut: కంగనా రనౌత్‌పై కేసు .. పోలీస్ స్టేషన్‌కు హృతిక్ రోషన్.. అసలేం జరిగిందంటే..!

Hrithik Roshan vs Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే.

Hrithik Roshan vs Kangana Ranaut: కంగనా రనౌత్‌పై కేసు .. పోలీస్ స్టేషన్‌కు హృతిక్ రోషన్.. అసలేం జరిగిందంటే..!
Shiva Prajapati
|

Updated on: Feb 27, 2021 | 5:35 PM

Share

Hrithik Roshan vs Kangana Ranaut: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, హీరోయిన్ కంగనా రనౌత్ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ముగిసిపోయిందనుకున్న ఈ వివాదం మరోసారి ప్రధాన అంశంగా మారింది. ఈమెయిల్స్ వేధింపుల విషయంలో కంగనపై కేసు నమోదు చేసిన హృతిక్ రోషన్.. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీస్ కమిషనర్ ఎదుట హాజరయ్యారు. పోలీసులు హృతిక్ రోషన్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు.

హృతిక్ రోషన్, కంగన రనౌత్ కలిసి 2010లో కైట్స్ అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు వీరి రిలేషన్ కొనసాగింది. దాదాపు పెళ్లి వరకు వెళ్లింది. కానీ అనూహ్య రీతిలో వీరిద్దరూ విడిపోయారు. ఆ తరువాత కొద్దికాలానికి హృతిక్, కంగన మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ‘సిల్లీ ఎక్స్’ అంటూ హృతిక్‌ను ఉద్దేశించి కంగనా కామెంట్స్ చేసింది. దీనిపై హృతిక్ తీవ్రంగా స్పందించాడు. ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడిన హృతిక్.. ‘నీతి లేని ప్రొఫెషనల్ కాని వాటి గురించి మాట్లాడటానికి ఈ ప్లాట్ ఫామ్ సరి కాదు. మరికొంత కాలం వెయిట్ చేయండి’ అంటూ వ్యాఖ్యానించాడు.

అలా ‘సిల్లీ ఎక్స్‌’తో మొదలైన ఈ వివాదం.. ఆ తరువాత కీలక మలుపు తిరిగింది. తన పేరుతో నకిలీ ఈమెయిల్ ద్వారా వందలాది మెయిల్స్‌ను పంపుతున్నారని, తనను విపరీతంగా వేధింపులకు గురి చేస్తున్నారని హృతిక్ రోషన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో కంగన పాత్ర ఉందంటూ హృతిక్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. దాంతో పోలీసులు కంగనాపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై సైబర్ క్రైమ్‌ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో స్టేట్‌మెంట్ రికార్డ్ కోసం కమిషనర్ కార్యాలయానికి రావాల్సిందిగా హృతిక్ రోషన్‌కు పోలీసులు నోటీసులు పంపారు. ఆ నోటీసులను అందుకున్న హృతిక్ ఇవాళ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు కమిషనర్ ప్రధాన కార్యాలయానికి వచ్చాడు. తన స్టేట్‌మెంట్‌ను ఇచ్చాడు.

ఇదిలాఉంటే.. హృతిక్ రోషన్ పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లడంపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై ట్వీట్ చేసిన కంగనా.. ‘ప్రపంచమంతా మారిపోయి ముందుకు వెళ్తున్నది. కానీ నా మాజీ ప్రియుడు సిల్లీగా అక్కడే ఆగిపోయాడు. కాలం కూడా వెనక్కి పోలేదు. కానీ నా మాజీ ప్రియుడు మాత్రం వెనక్కి వెళ్లి వివాదాన్ని తిరగదోడుతున్నాడు.’ అంటూ బాలీవుడ్ క్వీన్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇప్పుడు మరింత హాట్‌టాపిక్‌గా మారింది.

Also read:

Wing Commander Abhinandan: ఫోన్‌ కాల్‌, రహస్య లేఖ వల్లే పాకిస్థాన్‌ భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ను వదిలేశారు

మొన్న జానా.. నేడు వీహెచ్‌.. తెలంగాణ కాంగ్రెస్‌ను కుదిపేస్తున్న సోషల్‌మీడియా వ్యవహారం