Post Office Life Insurance Polices: పోస్టాఫీసుల్లో జీవిత బీమా పాలసీలు కలిగి ఉన్నారా..? అయితే మీకో శుభవార్త

Post Office Life Insurance Polices: పోస్టల్‌ శాఖ కస్టమర్లకు రోజురోజుకు కొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెస్తుంటుంది. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని వారికి మరింత..

Post Office Life Insurance Polices: పోస్టాఫీసుల్లో జీవిత బీమా పాలసీలు కలిగి ఉన్నారా..? అయితే మీకో శుభవార్త
Follow us
Subhash Goud

|

Updated on: Feb 27, 2021 | 3:48 PM

Post Office Life Insurance Polices: పోస్టల్‌ శాఖ కస్టమర్లకు రోజురోజుకు కొత్త స్కీమ్‌లను అందుబాటులోకి తెస్తుంటుంది. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని వారికి మరింత ప్రయోజనం చేకూరేలా మరిన్ని పథకాలను ప్రవేశపెడుతుంది. తాజాగా జీవిత పాలసీ కలిగి ఉంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి పోస్టల్‌ శాఖ శుభవార్త వినిపించింది. పోస్టాఫీస్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కలిగి ఉన్నవారికి బోనస్ లభించనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం పోస్టాఫీస్ లైఫ్ ఇన్సురెన్స్(పీఎల్ఐ)కు బోనస్ వర్తించేలా ప్రభుత్వం ప్రకటించింది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఈ బోనస్ అమలులోకి వస్తుంది.

ఇందులో వేయి రూపాయలకు రూ.76, ఎండోమెంట్ అస్యూరెన్స్ అయితే వేయికి రూ.52 బోనస్ అందుకునే అవకాశం ఉంది. పోస్టాఫీసులో ఆరు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. అవన్నీ సంప్రదాయబద్దమైన బీమాలు. అంటే లైఫ్ అస్యూరెన్స్(సురక్షా), ఎండోమెంట్ అస్యూరెన్స్(సంతోష్), జాయింట్ లైఫ్ అస్యూరెన్స్(యుగల్ సురక్ష), చిల్డ్రన్ పాలసీ(బాల్ జీవన్ బీమా), వోల్ లైఫ్ ఇన్సూరెన్స్(సువిధ), యాంటిస్పేటెడ్ అస్యూరెన్స్(సుమంగల్) లాంటి బీమా పథకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నియమాలు :

అయితే ఈ పోస్టల్‌ శాఖ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ నియమాలు 2011 ప్రకారం.. 2020 మార్చి 31వ తేదీ నాటికి పోస్టాఫీసు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్‌ ఆస్తులు, అప్పుల వ్యాల్యూయేషన్‌ ఆధారంగా పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలపై సాధారణ రివర్షనరీ బోనస్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ బోనస్‌ మరణం లేదా పాలసీ కాలపరిమితి ఆధారంగా చెల్లిస్తారు.

బీమా పాలసీలపై బోనస్‌:

– వోల్‌ లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీపై వెయ్యికి రూ.76లు అదనంగా లభిస్తుంది.

– ఎండోమెంట్‌ అస్యూరెన్స్‌ (ఈఏ)పై ఉమ్మడి జీవితం మరియు పిల్లల పాలసీలతో సహా వెయ్యికి రూ.52 బోనస్‌ లభిస్తుంది.

– యాంటిస్పెటేడ్‌ ఎండోమెంట్‌ అస్యూరెన్స్‌ పాలసీపై వెయ్యికి 48 రూపాయలు అదనపు సొమ్ము లభించనుంది.

– కన్వర్టబుల్‌ వోల్‌ లైఫ్‌ పాలసీలపై వోల్‌ లైఫ్‌ బోనస్‌ రేటు వర్తిస్తుంది. అయితే మార్చుకుంటే ఎండోమెంట్‌ అస్యూరెన్స్‌ బోనస్‌ రేటు లభిస్తుంది.

– రూ. 10000లు మొత్తంపై 20 రూపాయలు టెర్మినల్‌ బోనస్‌తో పాటు గరిష్టంగా వెయ్యి రూపాయలు వస్తుంది. ఇది ఇరవై ఏళ్ల కాలపరిమితి కలిగి ఉంటుంది.

– పోస్టల్‌ లైఫ్ ఇన్సూరెన్స్‌ పాలసీలను కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖ పరిధిలోని పోస్టల్‌ విభాగం నిర్వహిస్తోంది. ఇది పీఎల్‌ విధానాల్లోని సావరిన్‌ గ్యారంటిని ఇస్తుంది. 1894 నుంచి పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రభుత్వ, పాక్షిక ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంది.

Also Read: Bank Holidays March 2021: మార్చి నెలలో 8 రోజులు బ్యాంకులకు సెలవులు.. రెండు రోజులు సమ్మె.. పూర్తి వివరాలు