దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు మ్యూటేషన్స్ కారణం కాదట.. నిపుణులు ఏమంటున్నారంటే..?

Covid-19 Cases Surge: భారత్‌లో ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.. మరోవైపు కరోనావైరస్ కేసుల ఉధృతి కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల..

దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు మ్యూటేషన్స్ కారణం కాదట.. నిపుణులు ఏమంటున్నారంటే..?
Follow us

|

Updated on: Feb 27, 2021 | 12:04 PM

Covid-19 Cases Surge: భారత్‌లో ఓ వైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది.. మరోవైపు కరోనావైరస్ కేసుల ఉధృతి కూడా నిరంతరం పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగడంతో ఇటు ప్రజల్లో.. అటు ప్రభుత్వాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ తదితర కొత్తరకం కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. పెరుగుతున్న కేసుల మధ్య నిపుణులు పలు హెచ్చరికలు చేస్తున్నారు. అయితే భారత్‌లో పెరుగుతున్న కేసులకు కారణం మ్యూటేషన్స్ కాదని.. సూపర్ స్ప్రెడర్ ఈవెంట్స్ కారణమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కేసుల పెరుగుదలకు బహిరంగ కార్యక్రమాలు, శుభకార్యాల లాంటివే కారణమని.. దీనిని నియంత్రించకపోతే మరిన్ని పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

దేశంలో గత వారంలో నమోదైన కోవిడ్-19 కేసులను పరిశీలిస్తే.. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, ఛత్తీస్‌ఘడ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి. ఈ కొత్త కేసులతో SARS-CoV-2 కొత్త వేరియంట్‌లతో ముడిపడి ఉందా అనే ఆందోళన కూడా వ్యక్తమైంది. ఈ తరుణంలో మహారాష్ట్రలో కొత్త వేరియంట్ స్ప్రెడ్ అవతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని NIMHAN న్యూరో బయాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ వి రవి పేర్కొన్నారు. అయితే కమ్యూనిటీ వ్యాప్తికి శుభకార్యాలు, పలు బహిరంగ కార్యక్రమాలు, మార్కెట్లు, సూపర్ స్ప్రెడ్ ఈవెంట్స్ కారణమని తేలినట్లు పేర్కొన్నారు. కరోనా పరీక్షల తరువాత ట్రాకింగ్, ట్రేసింగ్ లేకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. దీంతోపాటు నిబంధనలు పాటించకపోవడం కూడా ఒక కారణమని తెలిపారు. ఎవరూ కూడా మాస్కులు ధరించడం లేదని.. భౌతిక దూరం పాటించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నిబంధనలను కచ్చితంగా పాటిస్తే కరో కేసులను నియంత్రించవచ్చని పేర్కొంటున్నారు. అయితే SAR-CoV-2 కొత్తరకం వైరస్‌లు N440K, E484Q మ్యూటేషన్లను మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో గుర్తించారు. ఈ క్రమంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు మ్యూటేషన్స్ కూడా కారణమని పలు ప్రభుత్వాలు పేర్కొన్నాయి. కానీ కోవిడ్ కేసుల పెరుగుదలకు మ్యూటేషన్ కాదని.. సూపర్ స్ప్రెడర్ కార్యక్రమాలే కారణమని పేర్కొనడంతో ప్రస్తుతం వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి.

Also Read:

Petrol, Diesel Price: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే..?

Corona: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?