Petrol, Diesel Price: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే..?

Petrol, Diesel Prcies today: దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా నిత్యం ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు..

Petrol, Diesel Price: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతంటే..?
Petrol Diesel Prcie
Follow us

|

Updated on: Feb 27, 2021 | 11:26 AM

Petrol, Diesel Prices today: దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత కొంతకాలంగా నిత్యం ధరలు పెరుగుతుండటంతో సామాన్య ప్రజలు నానా తంటలు పడుతున్నారు. ఈ నెలలోనే చమురు ధరలు 15 సార్లు పెరిగాయి. అయితే మూడు రోజులుగా స్థిరంగా సాగుతున్న ధరలు మరోసారి శనివారం పెరగడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. దేశంలో తాజాగా దేశీయ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై 25పైసలు వరకు పెంచాయి. కాగా కేవలం ఈ నెలలోనే చమురు ధరలు పెరగడం ఇది 16వ సారి.

తాజాగా పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 15 పైసలు చొప్పున ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.17 కు చేరగా, డీజిల్‌ ధర రూ.81.47 గా నమోదైంది. ముంబయిలో పెట్రోల్‌ ధర రూ.97.57, డీజిల్‌ రూ.88.70కి చేరుకుంది. బెంగళూరులో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.94.22కి పెరగగా.. డీజిల్ రూ.86.37కి చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.91.11కి ఉండగా.. డీజిల్ రూ.86.45కి చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.35కి చేరగా… డీజిల్ 15 పైసలు పెరిగి లీటర్ రూ.84.35కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో.. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రో ధరలు మండుతున్నాయి. ఇరు రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌పై 25పైసలు, డీజిల్‌పై 17పైసలు ధర పెరిగింది. దీంతో పెట్రోల్‌ ధర రూ.94.79 కు చేరగా.. డీజిల్‌ ధర రూ.88.86గా నమోదైంది. విజయవాడలో పెట్రోల్ లీటర్ 97.00కి చేరగా… డీజిల్ ధర రూ.90.55కి పెరిగింది.

అయితే గడిచిన 30 రోజుల్లో దాదాపు పెట్రోల్‌ ధర రూ.5 పెరగింది. కాగా ఇంధన ధరలు వరుసగా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా వినూత్న రీతుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గత 58రోజుల్లో చమురు కంపెనీలు.. పెట్రో ధరలను దాదాపు 26సార్లు పెంచాయి. ఈ క్రమంలోనే పెంచిన ధరలను తగ్గించాలంటూ నిన్న దాదాపు 40వేల సంఘాలు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కూడా నిర్వహించాయి.

Also Read:

ప్రధాని మోదీకి సెరావిక్ గ్లోబల్, ఎనర్జీ ఎన్విరాన్ మెంట్ లీడర్ షిప్ అవార్డు, హూస్టన్ కాన్ఫరెన్స్ లో ప్రదానం

PSLV-C51: నేడే కౌంట్‌డౌన్.. ‘ప్రైవేట్‌’ భాగస్వామ్యంతో.. ఇస్రో తొలి ప్రయోగం

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!