Gold & Silver Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో ఎంత రేట్ ఉందంటే..
బంగారం ధర మళ్లీ పడిపోయింది. గత కొన్ని రోజులు దిగివస్తున్న పసిడి ధరలు ఇవాళ మరింత తగ్గాయి. ఇది బంగారం కోనాలనుకునే వారికి ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు.
Gold Price Today In India: బంగారం ధర మళ్లీ పడిపోయింది. గత కొన్ని రోజులు దిగివస్తున్న పసిడి ధరలు ఇవాళ మరింత తగ్గాయి. ఇది బంగారం కోనాలనుకునే వారికి ఊరట కలిగించే విషయమని చెప్పుకోవచ్చు. కరోనా ప్రభావంతో గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ఇవాళ దేశీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,740 దగ్గర ఉండగా.. అటు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,740గా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో కూడా బంగారం ధరలలో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రధాన పట్టణాల్లో పుత్తడి ధర ఎంత ఉందో తెలుసుకుందాం.
శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.47,180 దగ్గర కొనసాగుతుంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.43,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల రేట్ రూ.47,180 దగ్గర కొనసాగుతుంది. ఇక అటు దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,540 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,680 ఉంది. ముంబై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,740 దగ్గర ఉంది. చెన్నై మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.43, 630 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.47,590 దగ్గర ఉంది. బెంగుళూరు మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,250 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.47,180 ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి.
Silver Price: ఇక బంగారం బాటలోనే వెండి కూడా స్వల్పంగా తగ్గింది. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ.68,800 ఉంది. అంటే 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.688 ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల సిల్వర్ రేట్ రూ.733 ఉండగా.. కిలో ధర రూ. 73,300 దగ్గర కొనసాగుతుంది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల వెండి ధర రూ.733 ఉండగా.. కేజీ సిల్వర్ రేట్ రూ.73,300 ఉంది. ఇక ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.688 ఉండగా.. కిలో వెండి ధర రూ.68,800 దగ్గర ఉంది. ముంబై 10 గ్రాముల ధర రూ.688 ఉంది. కిలో వెండి ధర రూ.68,800 దగ్గర కోనసాగుతుంది. అటు చెన్నై మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.733 ఉండగా.. కిలో వెండి ధర రూ. 73,300 ఉంది. పరిశ్రమ యూనిట్లు వెండి ధరలపై ప్రభావం చూపిస్తాయి.
Also Read:
SBI Pension Loans: పెన్షన్‌దారులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్.. ఒక్క ఎస్ఎంఎస్‌తో పెన్షన్ లోన్ మంజూరు