AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debit, Credit Cards: మీరు డెబిట్, క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..! అయితే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..

Debit, Credit Card Payments: ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్‌ సంస్థలు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లను ఎక్కువగా వాడుతున్నారా ? పేమెంట్ల కోసం క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఎక్కువగా

Debit, Credit  Cards: మీరు డెబిట్, క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..! అయితే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు తెలుసుకోండి.. లేదంటే నష్టపోతారు..
uppula Raju
|

Updated on: Feb 27, 2021 | 5:24 AM

Share

Debit, Credit Card Payments: ఆన్‌లైన్‌లో ఈ-కామర్స్‌ సంస్థలు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లను ఎక్కువగా వాడుతున్నారా ? పేమెంట్ల కోసం క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా ? అయితే ఇకపై మీరు ఆ కార్డులకు చెందిన 16 అంకెల నంబర్లను గుర్తుంచుకోవాలి. అవును. ఎందుకంటే ఆర్‌బీఐ పెట్టిన ఆంక్షలు అలా ఉండబోతున్నాయి. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..

ఆన్‌లైన్‌ మోసాలు, కార్డుల డేటా చోరీ జరుగుతున్న నేపథ్యంలో ఆర్‌బీఐ దేశంలోని ఈ-కామర్స్‌ సంస్థలు, డిజిటల్‌ వాలెట్లు, వీడియో స్ట్రీమింగ్‌ యాప్స్‌, ఫుడ్‌ డెలివరీ యాప్స్‌.. ఇలా ఒకటేమిటి.. ఇలాంటి అన్ని రకాల సంస్థలను వినియోగదారులకు చెందిన క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల డేటాను స్టోర్‌ చేయకుండా ఆంక్షలను విధించనుంది. ఈ మేరకు ఆర్‌బీఐ ఇప్పటికే ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల ఆయా సంస్థలకు చెందిన సైట్లు, యాప్‌లలో వినియోగదారులకు చెందిన డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాలు స్టోర్‌ కావు. ఫలితంగా వారు ఎప్పుడు కార్డులను వాడినా వాటి పూర్తి వివరాలు.. అంటే.. నంబర్‌, తేదీ, పేరు, సీవీవీ వంటి వివరాలను ఎప్పుడూ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో వినియోగదారులు కార్డు నంబర్లను గుర్తు పెట్టుకోవాలి. లేదా కార్డులను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి.

అయితే ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల క్యాష్‌లెస్‌ పేమెంట్లకు ఇబ్బంది కలుగుతుందని, దీంతో యూజర్లకు పేమెంట్లు చేసే విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయని ఆయా సంస్థలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఆర్‌బీఐ దీనిపై ముందుకు వెళ్లడానికే సిద్ధమవుతోంది. కార్డుల ఫ్రాడ్‌లను అరికట్టేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ క్రమంలో ఆయా సంస్థలకు చెందిన సైట్లు, యాప్‌లలో వినియోగదారులకు చెందిన కార్డుల వివరాలు ఇకపై స్టోర్‌ అవ్వవు. ప్రతి సారీ కార్డుల వివరాలను ఎంటర్‌ చేయాల్సిందే.

జర్నలిస్ట్ ఖషోగ్గీ హత్యపై అమెరికా దర్యాప్తు.. సౌదీ యువరాజు హస్తం ఉన్నట్టు ఆరోపణలు.. సీఐఏ దర్యాప్తులో సంచలన నిజాలు..

‘హార్టికల్చర్‌’పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు.. పాలిటెక్నిక్ కళాశాలల గురించి..

Follow Us
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్