AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హార్టికల్చర్‌’పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు.. పాలిటెక్నిక్ కళాశాలల గురించి..

TS Horticulture Policy : తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్శిటీలను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్‌ వ్యవసాయ అధికారులకు సూచించారు. ఉద్యానవన

'హార్టికల్చర్‌'పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు.. పాలిటెక్నిక్ కళాశాలల గురించి..
uppula Raju
|

Updated on: Feb 26, 2021 | 11:40 PM

Share

TS Horticulture Policy : తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్శిటీలను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్‌ వ్యవసాయ అధికారులకు సూచించారు. ఉద్యానవన పంటల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక అంశంపై ఆయన ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామి రెడ్డి, హార్టికల్చర్ యూనివర్శిటీ వీసీ నీరజ, తదితర హార్టికల్చర్ శాఖ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణలో ఉద్యానవన పంటల సాగు మరింత విస్తరించే దిశగా పరిశోధనలు చేపట్టాల్సిన అవసరమున్నదని అన్నారు. తెలంగాణ హార్టికల్చర్ అభివృద్ధి దిశగా, ఆధునిక పద్ధతుల్లో ఉద్యానవన పంటల సాగుకోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని 300 ఎకరాలను కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉద్యానవన విశ్వవిద్యాలయం మౌలిక సౌకర్యాల రూపకల్పన అభివృద్ధి కోసం ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తుందని సీఎం స్పష్టం చేశారు. వంటిమామిడి, రామగిరి ఖిల్లా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే 2,601 రైతు వేదిక నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇదే స్ఫూర్తితో సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల సెంటర్లలో గజ్వేల్ తరహా సమీకృత కూరగాయల మార్కెట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు వంటి వ్యవసాయ ప్రోత్సాహక చర్యలతో తెలంగాణ వ్యవసాయం గాడిలో పడిందన్నారు. రైతన్నల జీవితాలు గుణాత్మక అభివృద్ది దిశగా సాగుతున్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ హార్టికల్చర్ విధానాన్ని రూపొందించుకోవాలని సీఎం అన్నారు.

తెలంగాణలో మొత్తం 129 మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్ సహా, మరో 12 కార్పొరేషన్లు, ఇండస్ట్రియల్ నగరాలు, పట్టణాలున్నాయి. వీటన్నింటిలో నివసించే ప్రజలకు అవసరమైన కూరగాయలు పండ్లు వంటి నిత్యావసరాలను అందించేందుకు ఆ పట్టణాల చుట్టూ ఉండే కొందరు రైతులను ఎంపిక చేసి, కూరగాయలు తదితర ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరముంది. తద్వారా తెలంగాణలోని పట్టణ ప్రజలు ఇతర రాష్ట్రాలు నుంచి కూరగాయలను దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండదని సీఎం అన్నారు. మనం కూరగాయలను దిగుమతి చేసుకునే స్థాయినుంచి ఎగుమతి చేసే దిశగా ఉద్యానవనశాఖ చర్యలు చేపట్టాలని, తద్వారా అంతర్గతంగానే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ చేరుకునే వీలుందన్నారు.

ఉద్యానవనశాఖలో పని విధానాన్ని వికేంద్రీకరణ చేసుకోవాలని, ఇందుకు పని విభజన జరగాలన్నారు. ఇప్పుడు ఉద్యానవన శాఖకు ఒకే కమిషనర్ ఉన్నారని, ఇకనుంచి పండ్లు పండ్లతోటల సాగుకోసం, కూరగాయలు ఆకుకూరల సాగు కోసం, పామాయిల్ సాగు కోసం మొత్తంగా నలుగురు ఉన్నతాధికారులను నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ దిశగా క్షేత్రస్థాయి ఉద్యోగి వరకు పని విభజన జరగాలన్న సీఎం, ఉద్యానవనశాఖలో తక్షణం పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని, తగినంతగా సిబ్బంది ఏర్పాటుకు విధివిధానాలు రూపొందించాలని, హార్టికల్చరిస్టులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.

జర్నలిస్ట్ ఖషోగ్గీ హత్యపై అమెరికా దర్యాప్తు.. సౌదీ యువరాజు హస్తం ఉన్నట్టు ఆరోపణలు.. సీఐఏ దర్యాప్తులో సంచలన నిజాలు..