Former Zaheerabad MLA : జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే మృతి.. సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్..
Former Zaheerabad MLA : జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న(86) అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. రాజకీయ ప్రస్థానంలో సర్పంచి,
Former Zaheerabad MLA : జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న(86) అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. రాజకీయ ప్రస్థానంలో సర్పంచి, మండల ఎంపీపీగా పనిచేసిన ఆయన 1994లో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లో తెదేపా నుంచి ఎమ్మెల్యేగా, 2009లో భాజపా తరఫున జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాగన్న శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, జహీరాబాద్‌లో శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ భాగన్న మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాసేవ కోసం జీవితం అంకితం చేసిన భాగన్న నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.