Donkeys Missing: గాడిదల అక్రమ రవాణా.. మాంసం కోసం ఎగబడుతున్న జనాలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Donkeys Missing : గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గాడిదలు మాయమవుతున్నాయి. తాజాగా దాచేపల్లి వద్ద పోలీసులు లారీలో తరలిస్తున్న

Donkeys Missing: గాడిదల అక్రమ రవాణా.. మాంసం కోసం ఎగబడుతున్న జనాలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Donkeys Missing : గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో గాడిదలు మాయమవుతున్నాయి. తాజాగా దాచేపల్లి వద్ద పోలీసులు లారీలో తరలిస్తున్న 39 గాడిదలు పట్టుకున్నారు. రాజస్థాన్ టు చెరుకుపల్లి వయా హైదరాబాద్‌గా నడుస్తోంది అక్రమ వ్యాపారం. కొందరు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి అక్రమంగా వీటిని రవాణా చేస్తున్నారు. దీనిపై ఆరా తీస్తే సంచలన విషయలు వెలుగులోకి వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లో గాడిద మాంసాన్ని విపరీతంగా విక్రయిస్తున్నట్లుగా తేలింది. ముఖ్యంగా ఏపీలోని కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గాడిద మాంసం విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్రమంగా గాడిదలను తీసుకొచ్చి మాంసాన్ని విక్రయిస్తున్నారు. గతంలోనే ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న 8 గాడిదలను ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి.

వాస్తవానికి గాడిదను మాంసం కోసం వినియోగించే జంతువుగా పరిగణించరు. జంతు వధ చట్టం 2001 ప్రకారం.. గాడిదను చంపి మాంసంగా విక్రయించడం చట్టరీత్యా నేరం. గాడిదను చంపితే జంతు హింస చట్టం కింద, ఐపీసీ 428, 429 సెక్షన్ల ప్రకారం కఠిన శిక్షలు కూడా అమలు చేస్తారు. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా, కొంత మంది ఓ ముఠాగా ఏర్పడి యథేచ్ఛగా గాడిదలను అక్రమ రవాణా చేస్తూ, దాని మాంసాన్ని విక్రయిస్తున్నారు.

గాడిద మాంసాన్ని ప్రజలు ఇంతగా తినడానికి గత కారణాలను కూడా ‘టైమ్స్ టీమ్’ తేల్చింది. గాడిద మాంసం తినడం వల్ల లైంగిక పటుత్వం వస్తుందని జనాలు నమ్ముతున్నట్లు వెల్లడైంది. అలాగే గాడిద మాంసం తింటే బలవంతులుగా తయారవుతారని కూడా నమ్ముతున్నారట. దీంతో పెద్ద ఎత్తున గాడిద మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. బాగా ఎదిగిన గాడిద ధర ఏకంగా రూ. 10 వేల నుంచి రూ. 15 వేల వరకు పలుకుతోంది. దీన్ని బట్టి గాడిద మాంసాన్ని ఏ రేంజ్‌లో తినేస్తున్నారో అర్థమవుతోంది. తాజా లెక్కల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గాడిదల సంఖ్య కేవలం 5 వేలకు పడిపోయింది. అలాగే 2012 నుంచి దేశవ్యాప్తంగా గాడిదల సంఖ్య 60 శాతం మేర పడిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. గాడిదల అక్రమ రవాణా విషయమై సమాచారం అందిస్తే బాధ్యులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

‘హార్టికల్చర్‌’పై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయాలు.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు.. పాలిటెక్నిక్ కళాశాలల గురించి..

Click on your DTH Provider to Add TV9 Telugu