AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్ట్.. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేక పోస్టులే కారణమా.. అసలు నిజాలు ఏంటి?

ఓ వర్గాన్ని కించపరిచేలా సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేసిన వ్యక్తిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సైబర్‌ క్రైమ్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. నగరంలోని చంద్రాయణ్‌గుట్టకు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్ట్.. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేక పోస్టులే కారణమా.. అసలు నిజాలు ఏంటి?
uppula Raju
|

Updated on: Feb 27, 2021 | 5:51 AM

Share

ఓ వర్గాన్ని కించపరిచేలా సోషల్‌ మీడియాలో వీడియోలు పోస్టు చేసిన వ్యక్తిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సైబర్‌ క్రైమ్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. నగరంలోని చంద్రాయణ్‌గుట్టకు చెందిన మహ్మద్‌ అబు ఫైసల్‌ ఆలియాస్‌ మహ్మద్‌ లతీఫ్‌ కరోనా ప్రారంభదశలో సోషల్‌ మీడియాలో అసభ్యకర వీడియోలు పోస్టు చేశాడు. అప్పట్లో హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. లతీఫ్‌ గత కొన్ని నెలల నుంచి దుబాయ్‌లో తలదాచుకుంటున్నాడు. నిందితుడు దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తుండగా ఎయిర్‌పోర్టులో లుకౌట్‌ నోటీసుల ఆదేశాలు ఉండడంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు సైబర్‌ క్రైం పోలీసులకు సమాచారం అందించారు. లతీఫ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పోలీసులు అతన్ని ఆరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సోషల్ మీడియాతోపాటు ఇంటర్నెట్ లో యూజర్లు చేసే కామెంట్లు – పెట్టే పోస్టుల పట్ల ఇప్పుడు సర్వత్రా చర్చ నడుస్తోంది. మన దేశంలో ఏ వ్యక్తికైనా తన అభిప్రాయాన్ని చెప్పుకునే భావ ప్రకటనా స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించింది. అలా అని చెప్పి ఇంటర్నెట్ – సామాజిక మాధ్యమాల్లో యూజర్లు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతామన్నా కామెంట్లు చేస్తామన్నా కుదరదు. ఎందుకంటే భావ ప్రకటనా స్వేచ్ఛకు హద్దులు దాటి ప్రవర్తిస్తే అప్పుడు ఎవరైనా శిక్షార్హులే అవుతారు. ఈ నేపథ్యంలో చట్టం ఏం చెబుతోంది.. గీత దాటితే ఎలాంటి శిక్షలు పడతాయన్న విషయంలో నెటిజన్లు అవేర్ నెస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

* ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లలో అసభ్యకరమైన ఫొటో షేర్ చేస్తే.. ఐపీసీ సెక్షన్ 292 కింద శిక్షార్హులవుతారు. ఈ సెక్షన్ ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అదే ఇలాంటి పని మళ్లీ చేస్తే అప్పుడు ఏకంగా 5 ఏళ్ల పాటు జైలు. * మతాలను కించపరిస్తే… సున్నితమైన మతరపరమైన అంశాల్లో మొదట ఐటీ చట్టం కింద కేసు పెడతారు. ఆ తరువాత మతానికి సంబంధించిన అంశం గనక 295 సెక్షన్ పెడతారు. ఒక వేళ ఇలాంటి విషయాల్లో అవతలి వారి పరువుకు భంగం కలిగితే సెక్షన్ 499 కింద కేసు నమోదు అవుతుంది. *అనుమతి లేకుండా ఇతరుల ఫొటో వాడితే..? అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫొటోను వాడుకుంటే ఐటీ చట్టం సెక్షన్ 499 కింద కేసు పెడతారు. ఫొటోను వాడారు కనుక చీటింగ్ కేసు పెడతారు. అలాగే మార్ఫింగ్ చేస్తే ఆ కేసు కూడా పెట్టేందుకు అవకాశం ఉంటుంది. *నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే..? ఫేస్ బుక్ – ట్విట్టర్ లలో నకిలీ ప్రొఫైల్స్ ఎక్కువగా క్రియేట్ చేస్తుంటారు. అయితే ఇలా చేస్తే సెక్షన్ 499 కింద కేసు పెడతారు. అలాగే ఐటీ చట్టం సెక్షన్ 66డి కింద కూడా కేసు పెడతారు. *ఇతరుల వైఫైని దుర్వినియోగిస్తే..? ఐటీ చట్టంలో సెక్షన్ 66 కింద కేసు పెడతారు. ఇందులో ఉండే సబ్ సెక్షన్ల ప్రకారం కూడా కేసులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది.

జర్నలిస్ట్ ఖషోగ్గీ హత్యపై అమెరికా దర్యాప్తు.. సౌదీ యువరాజు హస్తం ఉన్నట్టు ఆరోపణలు.. సీఐఏ దర్యాప్తులో సంచలన నిజాలు..