AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దంపతుల మధ్య విభేదాలు.. కన్నకొడుకుని రోడ్డు పై వదిలేసిన తల్లి.. చివరకు ఆ చిన్నారి..

భార్య భర్తల మధ్య విభేదాలు రావడం సహజం. కొన్ని గొడవలు వాటంతటవే సర్దుమణుగుతాయి. మరికొన్ని పంచాయితీల వరకు వెళ్తుంటాయి. ఇంకొన్ని విడాకులు లేకుంటే కిడ్నలు,హత్యలకు

దంపతుల మధ్య విభేదాలు.. కన్నకొడుకుని రోడ్డు పై వదిలేసిన తల్లి.. చివరకు ఆ చిన్నారి..
Rajeev Rayala
|

Updated on: Feb 27, 2021 | 7:46 AM

Share

భార్య భర్తల మధ్య విభేదాలు రావడం సహజం. కొన్ని గొడవలు వాటంతటవే సర్దుమణుగుతాయి. మరికొన్ని పంచాయితీల వరకు వెళ్తుంటాయి. ఇంకొన్ని విడాకులు లేకుంటే కిడ్నలు,హత్యలకు కూడా దారితీస్తుంటాయి. ఇలాంటి వార్తలు మనం నిత్యం చూస్తుంటాం. తాజాగా ఓ తల్లి భర్త గొడవ పడి కన్నకొడుకుని నడి రోడ్డు పై వదిలేసి వెళ్ళింది. అభంశుభం తెలియని ఆ చిన్నారి అమ్మానాన్న కనిపించక రోడ్డు పై తిరుగుతూ పోలీసులకు కనిపించాడు.

వివరాల్లోకి వెళ్తే కుందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన రాధికకు కేశంపేట మండలం, సంతపూరు గ్రామానికి చెందిన దయ్యాల శ్రీకాంత్‌తో ఐదు ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.  కాగా ఈ మధ్య కాలంలో దంపతుల మధ్య విబేధాలు రాగా.. భార్య రాధిక ఒక కుమారుడు అనిరుధ్‌(3)ను తీసుకుని కటికపల్లి గ్రామంలో తన బంధువుల వద్ద ఉంటుంది.

ఈ క్రమంలో భర్తపై ఉన్న కోపంతో కొడుకు అనిరుధ్‌ను శుక్రవారం కుందుకూరు చౌరస్తాలో వదిలేసి వెళ్లిపోయింది. దాంతో ఆచిన్నారి దిక్కుతోచక ఏడుస్తూ ఆ రోడ్డు పై తిరుగుతూ ఉన్న సమయంలో అటుగా వెళ్తున్న పోలీసులు బాలుడిని చూసి చేరదీశారు. బాలుడిని తల్లిదండ్రులు, ఊరు అడుగగా ఆ చిన్నారి చెప్పలేక పోయాడు. దీంతో పోలీసులు బాలుడి ఫొటోను వాట్సాప్‌లో పెట్టి.. సంబంధీకులు , తెలిసినవారు ఎవరైనా ఉంటే సంప్రదించాలంటూ ఫోన్‌ నంబర్‌ ఇచ్చారు.. క్షణాల్లో ఈ విషయం వాట్సాప్‌లో చెక్కర్లు కొట్టడంతో కేవలం నాలుగు గంటల్లో బాలుడి తండ్రి శ్రీకాంత్‌ కొడుకు కోసం పోలీస్ స్టేషన్ కు వచ్చాడు.  కొడుకును తన భార్య రాధికనే వదలి పెట్టి వెళ్లినట్లు పోలీసులకు.  అనంతరం పూర్తి వివరాలు తెలుసినుకొని బాలుడిని తన తండ్రికి అప్పగించారు పోలీసులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వ్యక్తి అరెస్ట్.. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేక పోస్టులే కారణమా.. అసలు నిజాలు ఏంటి?

Donkeys Missing: గాడిదల అక్రమ రవాణా.. మాంసం కోసం ఎగబడుతున్న జనాలు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!