PSLV-C51: నేడే కౌంట్‌డౌన్.. ‘ప్రైవేట్‌’ భాగస్వామ్యంతో.. ఇస్రో తొలి ప్రయోగం

ISRO to launch PSLV-C51: భారత్ మరో ముందడుగు వేయనుంది. ఎన్నెన్నో మైలురాళ్లను సాధించిన భారత్.. మరో ఘనతను సాధించేందుకు సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్యర్యంలో..

PSLV-C51: నేడే కౌంట్‌డౌన్.. ‘ప్రైవేట్‌’ భాగస్వామ్యంతో.. ఇస్రో తొలి ప్రయోగం
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 27, 2021 | 9:03 AM

ISRO to launch PSLV-C51: భారత్ మరో ముందడుగు వేయనుంది. ఎన్నెన్నో మైలురాళ్లను సాధించిన భారత్.. మరో ఘనతను సాధించేందుకు సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్యర్యంలో మరో ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలు కానుంది. ఇస్రో మణిహారంలో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి 51 (PSLV-C51) తొలి ప్రయోగం మరో కలికితురాయి కాబోతోంది. ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో చిన్న ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లే రాకెట్‌ను ఇస్రో మొదటిసారి ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది.

శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న పీఎస్‌ఎల్‌వీ సీ51 ఫిబ్రవరి 28న ఉ.10.24 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. ఆదివారం సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌ ద్వారా దేశంలోని ప్రైవేట్‌ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇస్రో చైర్మన్, అంతరిక్ష శాఖ కార్యదర్శి శివన్ చెప్పారు. దీనికి శనివారం ఉ.9.24 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

మొత్తం 19 ఉపగ్రహాల్లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–1 ప్రధాన ఉపగ్రహం కాగా.. అమెరికాకు చెందిన స్పేస్‌ బీస్‌ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్‌–1 నానో కాంటాక్ట్‌–2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్‌ పేరుతో మూడు యూనివర్సిటీల విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీష్‌ ధవన్‌ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. కాగా, పీఎస్‌ఎల్‌వీ సీ51 రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తి చేసి సర్వం సిద్ధంచేశారు.

అయితే.. ఎస్ఎస్ఎల్వీడీ1 పరీక్ష విజయవంతమైతే.. భవిష్యత్ ప్రయోగాలపై ప్రణాళికలు వేస్తామని చెప్పారు. ఇప్పటికే ఎస్ఎస్ఎల్వీ డీ2 ప్రయోగం కోసం అమెరికాలోని సియాటిల్ లోని స్పేస్ ఫ్లైట్ ఐఎన్ సీ అనే సంస్థ ఒప్పందం చేసుకుందని శివన్ వెల్లడించారు. మన ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించడానికి పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ రాకెట్లు ఉన్నాయని.. ఇది విజయవంతమైతే.. ఇలాంటి రాకెట్లు మరెన్నో వస్తాయని వెల్లడించారు.

Also Read:

కూరగాయలు కొనడానికి 75 లక్షల బైక్‌తో వచ్చాడు.. ఇంకేముంది అందరూ పని పక్కన పెట్టి బైక్ చుట్టూ గుమిగూడారు..

Twitter CEO: ఎట్టకేలకు అభ్యంతర కంటెంట్‌పై స్పందించిన ట్విట్టర్‌ సీఈఓ.. విశ్వాసం సన్నగిల్లుతుందంటూ వ్యాఖ్యలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!