AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూరగాయలు కొనడానికి 75 లక్షల బైక్‌తో వచ్చాడు.. ఇంకేముంది అందరూ పని పక్కన పెట్టి బైక్ చుట్టూ గుమిగూడారు..

Honda Goldwing Trike : మనకు నచ్చిన బైక్ కొనుక్కోవడానికి ఇండియన్లకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉంది. డ్రీమ్ బైక్ ను సొంతం చేసుకోవాలనే ఎవరికి ఉండదు.

కూరగాయలు కొనడానికి 75 లక్షల బైక్‌తో వచ్చాడు.. ఇంకేముంది అందరూ పని పక్కన పెట్టి బైక్ చుట్టూ గుమిగూడారు..
uppula Raju
| Edited By: Team Veegam|

Updated on: Mar 01, 2021 | 1:52 PM

Share

Honda Goldwing Trike : మనకు నచ్చిన బైక్ కొనుక్కోవడానికి ఇండియన్లకు ఆ మాత్రం స్వేచ్ఛ ఉంది. డ్రీమ్ బైక్ ను సొంతం చేసుకోవాలనే ఎవరికి ఉండదు. ఇక అలా ఆశపడి మనది అయ్యాక వదిలి ఉండలేం. ప్రతి చోటకు దానితోనే వెళ్లిపోతాం. అలాగే ఓ వ్యక్తి వెజిటెబుల్స్, ఫ్రూట్స్ కొనుగోలు చేయడానికి కూరగాయల మార్కెట్ కు రూ.75లక్షల బైక్ తో వచ్చాడు.

రోడ్ పక్కనే బైక్ ఆపి.. కూరగాయలు కొనుక్కుని అందులో సర్దుకుంటుండగా మరో వ్యక్తి వీడియో తీశాడు. హోండా గోల్డ్ వింగ్ ట్రైక్ బైక్ స్టోరేజ్ లో కిరాణా సరుకులు దాచిపెట్టాడు. ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్‌కు డొమెస్టిక్ హెల్ప్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ బైక్ ఓనర్ పేరు బాబు జాన్. హోండా గోల్డ్ వింగ్ ట్రైక్ ఓ యూనిక్ బైక్. దానిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత ఒక సంవత్సరానికి రూ.24లక్షల కట్టిన తర్వాత దానిని రిలీజ్ చేశారు. అసలు ఖరీదు రూ.38లక్షలు ఉన్న బైక్ కు ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకున్నందుకు రూ.24లక్షలు కట్టాల్సి వచ్చింది.

NRIఅయిన బాబు జాన్ ఆ బైక్ ను యూఏఈ నుంచి దిగుమతి చేసుకున్నాడు. దాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి చాలా తంటాలు పడాల్సి వచ్చింది. ఆ విషయం కోర్టు వరకూ వెళ్లింది.ఈ బైక్ పవర్ ఎంతో తెలుసా.. 1832సీసీ. ఆరు సిలిండర్ ఇంజిన్. గరిష్టంగా 118బీహెచ్ పీ వెళ్లగలదు. ఇంకా ఈ మోటార్ సైకిల్ కు రివర్స్ గేర్ కూడా ఉంది. ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 55లీటర్లు. ఇండియాలోని చాలా కార్ల ఫ్యూయెల్ ట్యాంకుల కంటే ఇది ఎక్కువ.

నగరంలో లగ్జరీ బైక్స్‌ హవా నడుస్తోంది. కొంతమంది స్టేటస్‌ కోసం.. మరికొంతమంది లుక్‌ నచ్చడంతో ఖరీదు ఎంతైనా పట్టించుకోకుండా కొనేస్తున్నారు. బైక్‌ కొన్నామా.. రయ్‌ మంటూ దూసుకుపోయామా..అంతే అంటున్నారు కుర్రకారు. రోడ్లపై అందరి దృష్టి తమ బైక్‌పై పడటంలో ఉండే మజానే వేరని చెబుతున్నారు. అందుకోసం మార్కెట్‌లోకి లేటెస్ట్‌ బైక్‌ ఏది వచ్చినా కొనేస్తున్నారు. యువకుల ఆసక్తికి అనుగుణంగా కొన్ని కంపెనీలు బైక్స్‌ని డిజైన్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా రాయల్‌ఎన్‌ఫీల్డ్‌, యమహా, హార్లీడేవిడ్సన్‌, కేటీఎం, బెనేల్లి, సుజుకీ తదితర కంపెనీల మోడల్స్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది.

అంతేకాదు బైక్స్‌కి సైలెన్సర్‌ మార్చేసీ.. సౌండ్‌ మోగేలా అమర్చుకుంటున్నారు. రాయల్‌గా కనిపించడం కోసం బైక్స్‌కి అదనపు యాక్ససరీస్‌ జతచేసి లుక్‌ మార్చుకుంటున్నారు. అందుకోసం కూడా లక్షలు వెచ్చిస్తున్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ బైకుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. సుమారు 2 లక్షల నుంచి కోటి 25 లక్షల వరకు బైక్స్‌ నగర రోడ్లపై హల్‌చల్‌ చేస్తున్నాయి. డుకాటీ సంస్థ కూడా కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టింది. మల్టిస్ట్రేడా 1260 ఎండూరో మోడల్‌ బైక్‌ ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి.

Honda cars: భారత్‏లో ఇకనుంచి ఆ కార్లు దొరకవు.. కీలక నిర్ణయం తీసుకున్న హోండా సంస్థ..

ప్యాకెట్ పాలు తాగుతున్నారా..! చిన్న పిల్లలకు పట్టిస్తున్నారా..? అయితే ఎన్ని అనర్థాలున్నాయో తెలుసుకోండి..

Krithi Shetty : ఆ యాడ్స్‌లో నటించింది చిన్నప్పటి బేబమ్మేనా..! ఆ వయసులో కెమెరా ముందు అదరగొట్టిన కృతిశెట్టి..