Honda cars: భారత్‏లో ఇకనుంచి ఆ కార్లు దొరకవు.. కీలక నిర్ణయం తీసుకున్న హోండా సంస్థ..

భారత్‏లో ఇకనుంచి తమ సంస్థకు చెందిన రెండు కార్లు అందుబాటులో ఉండబోవని ప్రముఖ ఆటోమోబైల్ సంస్థ హోండా తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు ప్లాంట్లలో

Honda cars: భారత్‏లో ఇకనుంచి ఆ కార్లు దొరకవు.. కీలక నిర్ణయం తీసుకున్న హోండా సంస్థ..
Follow us

|

Updated on: Dec 23, 2020 | 9:44 PM

భారత్‏లో ఇకనుంచి తమ సంస్థకు చెందిన రెండు కార్లు అందుబాటులో ఉండబోవని ప్రముఖ ఆటోమోబైల్ సంస్థ హోండా తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు ప్లాంట్లలో ఒక దానిని మూసివేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. హోండా సివిక్, హోండా సీఆర్-వీల కార్ల ఉత్పత్తిని ఇకమీదట ఆపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన ప్లాంట్లు గ్రేటర్ నోయిడా, రాజస్థాన్‏లోని తపుకరాలలో ఉన్నాయి. ఇందులో భాగంగా గ్రేటర్ నోయిడాలో ఉన్న ప్లాంటును మూసివేయనున్నట్లు హోండా ప్రకటించింది. నోయిడాలో ఉన్న హోండా సిటీని తపుకరా ప్లాంటుకు తరలించనుంది. ఇకా ఇందులో రెండు మోడల్స్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు ఎంతోమంది జనాదరణ పొందిన హోండా సివిక్, హోండా సీఆర్-వీ మోడల్స్ ఉత్పత్తులను నిలిపివేయడం తమకు చాలా కష్టమైన నిర్ణయమని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ రాజేయ్ గోయేల్ తెలిపారు. అంతేకాకుండా రాబోయే 15 సంవత్సరాలకు ఈ రెండు కార్ల యజమానులకు అన్ని రకాలుగా సహాయాలు అందిస్తామని తెలిపారు.