అప్పులిచ్చే యాప్‌ల ఉచ్చులో పడొద్దు..వ్యక్తిగత వివరాలను ఇవ్వొద్దు.. మోసాలపై ఆర్బీఐకి ఫిర్యదు చేయాలని భరోసా..

కరోనా కష్టకాలంలో డబ్బుల కోసం ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు... ఈ నేపథ్యంలో పలువురు ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా అప్పులు తీసుకుంటున్నారు. వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నా అధిక వడ్డీతో జనం నడ్డి....

అప్పులిచ్చే యాప్‌ల ఉచ్చులో పడొద్దు..వ్యక్తిగత వివరాలను ఇవ్వొద్దు.. మోసాలపై ఆర్బీఐకి ఫిర్యదు చేయాలని భరోసా..
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 23, 2020 | 8:40 PM

కరోనా కష్టకాలంలో డబ్బుల కోసం ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు… ఈ నేపథ్యంలో పలువురు ఆన్‌లైన్‌ యాప్స్‌ ద్వారా అప్పులు తీసుకుంటున్నారు. వాయిదాలు సక్రమంగా చెల్లిస్తున్నా అధిక వడ్డీతో జనం నడ్డి విరుస్తున్నారు యాప్ నిర్వాహకులు. దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. ప్రజలకు పలు సూచనలు చేసింది.

దోపిడీలకు పాల్పడుతున్న అలాంటి యాప్‌ల ఉచ్చులో పడొద్దని సూచించింది. వ్యక్తిగత వివరాలు, పత్రాలు ఎవరికీ ఇవ్వొద్దని ప్రజలకు తెలిపింది. ఆర్‌బీఐ, ఎన్‌బీఎఫ్‌సీకిలోబడి ఉన్న సంస్థల వద్దే రుణాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎలాంటి నియమ నిబంధనలు పాటించని యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ మేరకు ఆర్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ యోగేశ్‌ దయాల్‌ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. సులభంగా రుణాలు ఇస్తున్నారా కదా అని ఈ యాప్‌ల మాయలో మాత్రం పడవద్దని కోరింది. ఒకసారి రుణాలు తీసుకునే ముందు ఆలోచించాలి అన్నారు.

సులువుగా రుణాలు ఇస్తున్నారన్న కారణంతో వ్యక్తులు, చిన్న వ్యాపారులు ఈ యాప్‌లకు ఆకర్షితులు అవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సీజీఎం పేర్కొన్నారు. తీరా రుణాలు ఇచ్చాక అధిక వడ్డీ, హిడెన్‌ ఛార్జీల పేరిట అధిక మొత్తాలు వసూలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. రుణాలు తిరిగి చెల్లించే విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్నాయన్నారు. అంతేకాకుండా ముందస్తుగా కుదిరిన ఒప్పందాన్ని దుర్వినియోగం చేస్తూ రుణ గ్రహీతల ఫోన్ల నుంచి వ్యక్తిగత డేటాను వినియోగించడం ఆమోదయోగ్యం కాదని సీజీఎం సీజీఎం యోగేశ్‌ దయాల్ పేర్కొన్నారు. యాప్‌ల మోసాలపై ఆర్‌బీఐకి చెందిన sachet.rbi.org.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.