christmas 2020 : భిన్న సంస్కృతుల భారతదేశంలో క్రిస్మస్ పండుగ…ఇండియాలో క్రైస్తవుల సంఖ్య ఎంత..ఇతర వివరాలు ?
భారతదేశంలో ఇతర మతపరమైన పండుగలతో పోల్చితే, క్రిస్మస్ ఒక చిన్న పండుగగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇండియాలో క్రైస్తవుల సంఖ్య మొత్తం జనాభాలో సుమారు 2.3 శాతం మాత్రమే. గణాంకపరంగా, భారతదేశంలో 25 మిలియన్లకు పైగా క్రైస్తవులు ఉన్నారని చెప్పవచ్చు.
భారతదేశంలో ఇతర మతపరమైన పండుగలతో పోల్చితే, క్రిస్మస్ ఒక చిన్న పండుగగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇండియాలో క్రైస్తవుల సంఖ్య మొత్తం జనాభాలో సుమారు 2.3 శాతం మాత్రమే. గణాంకపరంగా, భారతదేశంలో 24 మిలియన్లకు పైగా క్రైస్తవులు ఉన్నారని చెప్పవచ్చు. అతిపెద్ద భారతీయ క్రైస్తవ సంఘాలలో ఒకటి ముంబైలో ఉంది. భారతదేశపు అతిచిన్న రాష్ట్రం గోవాలో 25% మంది క్రైస్తవులు ఉన్నారు.
మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్ మరియు మిజోరాం (భారతదేశానికి చాలా తూర్పున) రాష్ట్రాలలో క్రైస్తవులు అధికంగా నివసిస్తున్నారు. భారతదేశంలోని క్రైస్తవులకు, ముఖ్యంగా కాథలిక్కులకు మిడ్ నైట్ మాస్ చాలా ముఖ్యమైన సేవ. తరువాత రుచికరమైన విందు ఉంటుంది. ఆపై బహుమతులు ఇవ్వడం, స్వీకరించడం జరుగుతుంది.
క్రిస్మస్ ఈవ్ మిడ్ నైట్ మాస్ సేవ కోసం భారతదేశంలోని చర్చిలను పాయిన్‌సెట్టియా పువ్వులు, కొవ్వొత్తులతో అలంకరిస్తారు. గోవాలోని క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. ఎందుకంటే గోవాకు పోర్చుగల్‌తో చారిత్రక సంబంధాలు ఉన్నాయి. చాలా ప్రాచుర్యం పొందిన సంప్రదాయ రిచ్ ఫ్రూట్ క్రిస్మస్ కేక్ కాకుండా క్రిస్మస్ సందర్భంగా స్థానికులు స్వీట్లు కూడా పంచుకుంటారు. కేరళ రాష్ట్రంలో 18.38% మంది క్రైస్తవులు ఉన్నారు. కేరళలో ఘనంగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ఒకటి. క్రైస్తవులు వారి ఇళ్లను మెరిసే, ఫాన్సీ క్రిస్మస్ స్టార్‌తో, చర్చిలను క్రిబ్స్‌తో అలంకరిస్తారు.