యువతికి ‘సైబర్ వేధింపులు’, అమెరికాలో భారత సంతతి యువకుడి అరెస్ట్, వయస్సు 19 ఏళ్ళు, 5 ఏళ్ళ జైలుశిక్ష తప్పదా ?

న్యూయార్క్ లో ఓ యువకుడు సోషల్ మీడియా ద్వారా అనేకరకాలుగా ఓ యువతిని వేధించిన 19 ఏళ్ళ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడ్ని భారత సంతతికి చెందిన డెన్మాండ్ బబ్లూ సింగ్ గా గుర్తించారు.

యువతికి 'సైబర్ వేధింపులు', అమెరికాలో భారత  సంతతి యువకుడి అరెస్ట్, వయస్సు 19 ఏళ్ళు, 5 ఏళ్ళ జైలుశిక్ష తప్పదా ?
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Dec 24, 2020 | 12:22 PM

న్యూయార్క్ లో ఓ యువకుడు సోషల్ మీడియా ద్వారా అనేకరకాలుగా ఓ యువతిని వేధించిన 19 ఏళ్ళ యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడ్ని భారత సంతతికి చెందిన డెన్మాండ్ బబ్లూ సింగ్ గా గుర్తించారు. తన అక్కకు ఒకప్పటి స్నేహితురాలైన యువతిని ఈ సింగ్ పెళ్లి చేసుకోగోరాడని, అయితే ఆమె తిరస్కరించడంతో ఆమెకు ఈ-మెయిల్స్ పంపుతూ నిన్ను రేప్ చేస్తానని, హతమారుస్తానని, మీ ఇంట్లో బాంబులు పెట్టి మీ కుటుంబ సభ్యులను చంపేస్తానని..ఇలా నానా రకాలుగా ఆమెను ఇతగాడు వేధించి, తీవ్రమైన మానసిక్స్ క్షోభకు గురి చేశాడని తెలిసింది. మేరీలాండ్ లో నివసించే ఆమెను ఇలా మనసికంగా చిత్ర హింసలకు గురి చేయడానికి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు వరకు దాదాపు వందకు పైగా సోషల్ మీడియా, ఎలెక్ట్రానిక్ కమ్యూనికేషనన్ సాధనాలు, ఫోన్ అకౌంట్లను వినియోగించాడని , అసభ్య సందేశాలను పంపేవాడని తెలిసింది. ఇతడిని కోర్టు దోషిగా ప్రకటిస్తే గరిష్టంగా 5 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది.