AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

christmas wishes : జెరూసలెం హోలీ సెపల్కర్‌ చర్చి సంరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ముస్లిం కుటుంబం

జెరూసలెంలోని హోలీసెపల్కర్‌ చర్చికి ఓ విశిష్టత ఉంది.. ఈ ప్రార్థనామందిరం ప్రపంచంలోని క్రైస్తవులందరికీ ఎంతో ఎంతో పవిత్రం. అందుకు కారణం ఏసుక్రీస్తు సమాధి ఈ చర్చిలోనే భద్రపరిచారన్న నమ్మకం.

christmas wishes : జెరూసలెం హోలీ సెపల్కర్‌ చర్చి సంరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ముస్లిం కుటుంబం
Balu
| Edited By: |

Updated on: Dec 24, 2020 | 1:21 PM

Share

జెరూసలెంలోని హోలీసెపల్కర్‌ చర్చికి ఓ విశిష్టత ఉంది.. ఈ ప్రార్థనామందిరం ప్రపంచంలోని క్రైస్తవులందరికీ ఎంతో ఎంతో పవిత్రం. అందుకు కారణం ఏసుక్రీస్తు సమాధి ఈ చర్చిలోనే భద్రపరిచారన్న నమ్మకం. కొంతకాలం కిందట సమాధి ఉన్నట్లుగా భావిస్తున్న స్థలాన్ని పునరుద్ధరించారు కూడా! ఈ విషయం అలా ఉంచితే, ఈ చర్చి సంరక్షణా విధులను నిర్వర్తిస్తోంది ఓ ముస్లిం కుటుంబం. దాదాపు ఎనిమిది శతాబ్దాల నుంచి చర్చి సంరక్షణా బాధ్యతలను ఈ ముస్లిం కుటుంబమే చూస్తోంది. చర్చికున్న ప్రధాన ద్వారం తాళం చెవి ఈ ముస్లిం కుటుంబం దగ్గరే ఉంటుంది. ప్రస్తుతం ఆ ఫ్యామిలీలోని 80వ తరానికి చెందిన అదీబ్‌ జౌదే దగ్గర ఈ తాళం చెవి ఉంది. ప్రతి రోజూ చర్చి తలుపులు తెరవడం ఈయన విధి! అలాగే తలుపులు మూసి తాళం వేయడం కూడా ఈయన డ్యూటీనే! ఏరోజూ వీళ్లు తమ బాధ్యతలను విస్మరించలేదు. కొన్ని వందల ఏళ్ల కిందట ఈ చర్చి నిర్వాహణ క్రైస్తువుల చేతుల్లోనే ఉండేది. కాకపోతే క్రైస్తవులలో ఆర్మేనియన్‌, గ్రీక్‌, ఫ్రాన్సిస్కాన్‌లు ఉండేవారు. ఇలాగైతే లాభం లేదని చర్చి సంరక్షణ బాధ్యతలను తటస్థ వ్యక్తికి అప్పగిస్తే బాగుంటుందని అనుకున్నారు. వెంటనే ఎంతో ప్రజాభిమానం కలిగిన ఓ ముస్లిం పెద్దకు ఆ బాధ్యతలను అప్పగించారు. అప్పటి నుంచి చర్చి ప్రధాన ద్వారం తాళం చెవి ఈ ముస్లిం కుటుంబం దగ్గరే ఉంటూ వస్తోంది. ప్రస్తుతం రెండు ముస్లిం కుటుంబాలు చర్చి ఆలనా పాలనా చూస్తున్నాయి. అదన్నమాట సంగతి!

మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
మీరు చెప్తే విశ్వం వింటుంది!.. ఈ టెక్నిక్‌తో మీ కోరికలు నెరవేర్చు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై ఛార్జ్‌షీట్.. 23 మందిపై అభియోగాలు
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ బ్యాంకులు మూతపడనున్నాయ్‌.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన్
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా.. చూపుడు వేలు ఆకారం వెనుక
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ముట్టుకుంటే మరణమే..! ప్రపంచంతో అత్యతం విషపూరితమైన పక్షిఇదేనట!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
ప్రభాస్‌ పక్కకు వెళ్లేలా ఐకాన్‌ స్టార్ రికార్డ్‌
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే
గుండెపోటు వచ్చే 30 నిమిషాల ముందు శరీరంలో కనిపించే 5 లక్షణాలు ఇవే