అలాంటప్పుడు అసెంబ్లీ ఎందుకు? ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా? : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం బాధాకరమన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ప్రివిలేజ్ కమిటీ ఏకపక్షంగా వ్యవహరించకూడ...

అలాంటప్పుడు అసెంబ్లీ ఎందుకు? ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే ప్రివిలేజ్ మోషన్ ఇస్తారా? : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
Follow us
Venkata Narayana

|

Updated on: Dec 24, 2020 | 12:10 PM

ప్రజాసమస్యలు ప్రస్తావిస్తే ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం బాధాకరమన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. ప్రివిలేజ్ కమిటీ ఏకపక్షంగా వ్యవహరించకూడదన్నారు. అలాంటప్పుడు అసెంబ్లీ ఎందుకు? లోటస్ పాండ్‌లోనో.. వైసీపీ ఆఫీస్‌లోనో సమావేశాలు పెట్టుకోవచ్చుకదా అని నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. సీఎం జగన్, మంత్రి కన్నబాబుపై తాము మూవ్‌ చేసిన ప్రివిలేజ్ మోషన్‌ని స్పీకర్ ప్రివిలేజ్‌ కమిటీకి పంపకపోవడం అన్యాయమన్నారు. టీడీపీ హయాంలో రోజాను ఏడాది పాటు సభనుంచి బహిష్కరించడం సరికాదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారాలకు తిలోదకాలిస్తూ ఈ మొత్తం ఎపిసోడ్‌ అంతా పూర్తిగా రాజకీయమైపోయిందని నిమ్మల వ్యాఖ్యానించారు. ఏపీ హాట్ పాలిటిక్స్: టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు టెన్ డేస్ టైమిచ్చిన ప్రివిలేజ్‌ కమిటీ