AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Packet Milk : ప్యాకెట్ పాలు తాగుతున్నారా..! చిన్న పిల్లలకు పట్టిస్తున్నారా..? అయితే ఎన్ని అనర్థాలున్నాయో తెలుసుకోండి..

Packet Milk : పాలు మంచి పౌష్టికాహారం అనడంలో సందేహం లేదు. కానీ మనం నిత్యం తీసుకునే పాలల్లో ఎంత స్వచ్ఛత ఉంది, ఎంతవరకు నాణ్యమైనవనే

Packet Milk : ప్యాకెట్ పాలు తాగుతున్నారా..!  చిన్న పిల్లలకు పట్టిస్తున్నారా..?  అయితే ఎన్ని అనర్థాలున్నాయో తెలుసుకోండి..
uppula Raju
|

Updated on: Mar 01, 2021 | 5:51 AM

Share

Packet Milk : పాలు మంచి పౌష్టికాహారం అనడంలో సందేహం లేదు. కానీ మనం నిత్యం తీసుకునే పాలల్లో ఎంత స్వచ్ఛత ఉంది, ఎంతవరకు నాణ్యమైనవనే సందేహాలు అధికంగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో పండ్లు, నూనె, అల్లం, వెల్లుల్లి, కారం, పసుపు, పాలు అని పదార్థమేదైనా కల్తీకి అర్హతగా మారింది. ప్రాసెస్‌ చేసిన పాల ఉత్పత్తులను వినియోగించడం ద్వారా ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

హోటళ్లు, టీ స్టాళ్లు కాఫీలలో వాడే పాలు 100శాతం ప్రాసెస్‌ చేసినవే. మనం వాడే ప్యాకెట్‌ పాలకు కారణమయ్యే పాలపొడిని ఈ విధంగా తయారుచేస్తున్నారు. మొదటగా సెంట్రిఫ్యూజ్‌ అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్లు, కొవ్వు, నీటిని వేరుచేస్తారు. వేరుచేసిన కొవ్వును ఐస్‌క్రీమ్‌ కంపెనీలకు అమ్ముతారు. మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి పాశ్చరైజేషన్‌ ద్వారా అందులోని సూక్ష్మ జీవులను చంపేస్తారు. పాల తయారీకి మూలమైన పాలపొడిని ఈ విధంగా తయారుచేస్తారు. చిన్న రంధ్రం ద్వారా ఎక్కువ ఒత్తిడితో పాలను గాలిలోకి పిచికారి చేస్తారు. దీని వల్ల పాలు ఎండి పాలపొడిగా మారుతుంది.

ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోకి నైట్రేట్స్‌ను కలుపుకుని ఆక్సిడైజ్‌ అవుతుంది. ఈ విధంగా తయారైన ఆక్సిడైజ్‌ కొలెస్ట్రాల్‌ మానవ శరీరంలోని రక్తనాళాలను తొందరగా మూసివేసి గుండె, రక్తనాళాల జబ్బులకు కారణమవుతుంది. తక్కువ కొవ్వు ఉండే పాలు గుండె జబ్బులకు మంచిదని ప్యాకెట్‌ పాలను వాడుతుంటే వాటి వల్లే గుండె జబ్బులు అధికమవుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్యాకెట్‌ పాలు కొద్ది రోజులు నిల్వ ఉండేందుకు వీలుగా వాడే పోర్సిలిన్‌ తరహా రసాయనాలు మానవ శరీరంలో తీవ్రస్థాయి నష్టాలను కలిగిస్తున్నాయి. కృత్రిమ పాలు, కల్తీ పాలు మానవశరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.

ఈ కృత్రిమపాలు ప్యాకెట్‌ పాలకంటే మరీ ప్రమాదకరం. విష రసాయనాలతో కూడుకున్న కృత్రిమ పాలు తాగితే మానవునిలోని ప్రతి అవయవం దెబ్బతినే అవకాశముంది. యూరియా, ఇతర రసాయనాల ద్వారా కృత్రిమ పాలను తయారుచేస్తున్నారు. ఈ కృత్రిమ పాలను చిన్న పిల్లలు తాగడం వల్ల వాంతులు, వీరేచనాలతో అస్వస్థతకు గురవుతారు. జీర్ణకోశ వ్యాధులతోపాటు క్యాన్సర్‌ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశముంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో ‘క్రాక్ జయమ్మ’.. పొలిటికల్ లీడర్‌గా తడాఖా చూపనున్న తమిళ లేడీ విలన్..