AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో ‘క్రాక్ జయమ్మ’.. పొలిటికల్ లీడర్‌గా తడాఖా చూపనున్న తమిళ లేడీ విలన్..

Tamil actress Varalakshmi : కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. సామాజికాంశాలతో ఇది రూపుదిద్దుకోనున్నట్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో 'క్రాక్ జయమ్మ'.. పొలిటికల్ లీడర్‌గా తడాఖా చూపనున్న తమిళ లేడీ విలన్..
uppula Raju
|

Updated on: Feb 28, 2021 | 10:56 PM

Share

Tamil actress Varalakshmi : కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. సామాజికాంశాలతో ఇది రూపుదిద్దుకోనున్నట్లు తెలుస్తోంది. #AA21గా రానున్న ఈ చిత్రంలోని ప్రథమార్ధంలో స్టూడెంట్‌ లీడర్‌గా.. ద్వితీయార్ధంలో రాజకీయ నాయకుడిగా బన్నీ కనిపిస్తారని ఎన్నో రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. త్వరలో చిత్రీకరణలో పాల్గొననున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ స్టార్ కుమార్తె కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది.

నటుడు శరత్‌కుమార్‌ కుమార్తె నటి వరలక్ష్మి ఈ సినిమాలో ఓ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘క్రాక్‌’లో జయమ్మగా, ‘నాంది’లో ఆద్యగా మెప్పించి తెలుగువారికి చేరువైన వరలక్ష్మి.. బన్నీ సినిమాలో రాజకీయ నాయకురాలిగా కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై చిత్రబృందం ఇప్పటికే ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటి వరకు చిత్ర బ‌ృందం మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.

ఈ విషయం ఇలా ఉంటే .. డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్‌తో అల్లు అర్జున్ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా తర్వాత బన్నితో ఓ సినిమా చేస్తే బాగుంటుందని ఫీలవుతున్నట్లు సమాచారం. బొమ్మరిల్లు భాస్కర్‌, అఖిల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సినిమా సక్సస్ అయితే.. అరవింద్‌ ముందడు వేసి బన్నీ, భాస్కర్‌ కాంబినేషన్ను సెట్ చేస్తాడట. లేదంటే అంతే సంగతులు. ఇక సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సినిమా విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే మూడో చిత్రం ఇది కాగా.. అభిమానులతో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Allu Arjun : బన్నీ అభిమానులకు గుడ్ న్యూస్..ఫ్యూచర్‌లో అద్భుతాలు రాబోతున్నాయంటూ స్టైలిష్ స్టార్ స్టేట్మెంట్