Corona: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Coronavirus updates in India: దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటంతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో..

  • Shaik Madarsaheb
  • Publish Date - 10:51 am, Sat, 27 February 21
Corona: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Coronavirus updates in India: భారత్‌లో కరోనావైరస్ కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటంతో అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోందని.. ఆ రాష్ట్రాల్లో 90శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్రం ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అత్యధికంగా మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఆ తరువాత వరుసగా.. కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటకలో నమోదవుతుండటంతో.. ఆయా రాష్ట్రాలు పలు ఆంక్షలను విధించాయి.

కాగా.. గత 24గంటల్లో శుక్రవారం దేశవ్యాప్తంగా 16,488 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,79,979 (1.10కోట్లు) కు పెరిగింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 113 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,56,938 కు చేరాయి. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా.. డిశ్చార్జ్‌ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. నిన్న కరోనా నుంచి 12,771 మంది బాధితులు మాత్రమే కోలుకున్నట్లు వైద్యశాఖ వెల్లడించింది. వీరితో కలిపి ఇప్పటివరకు 1,07,63,451 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,59,590 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే దేశంలో మళ్లీ యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన మొదలైంది.

ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 97.14 శాతం ఉండగా.. మరణాల రేటు 1.42 శాతంగా ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 7,73,918 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఫిబ్రవరి 26వ తేదీ వరకు మొత్తం 21,54,35,383 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ పేర్కొంది.

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 1,42,42,547 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ.. ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు.

 

Also Read: