Corona: రిటైల్‌ స్టోర్‌ల వద్ద కరోనా వ్యాప్తికి ఎలా అడ్డుకట్ట వేయాలి.? సరికొత్త విధానాన్ని సూచించిన పరిశోధకులు..

Reduce COVID Transmission At Retail Stores: వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ఇంకా కరోనా మహమ్మారి భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఓవైపు కేసుల సంఖ్య తగ్గుతుందని సంతోషించేలోపే మరోసారి...

Corona: రిటైల్‌ స్టోర్‌ల వద్ద కరోనా వ్యాప్తికి ఎలా అడ్డుకట్ట వేయాలి.? సరికొత్త విధానాన్ని సూచించిన పరిశోధకులు..
Follow us

|

Updated on: Feb 27, 2021 | 11:04 AM

Reduce COVID Transmission At Retail Stores: వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ఇంకా కరోనా మహమ్మారి భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. ఓవైపు కేసుల సంఖ్య తగ్గుతుందని సంతోషించేలోపే మరోసారి వైరస్‌ విజృంభన పెరిగిపోతోంది. మొన్నటి వరకు కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నట్లు కనిపించినా తాజాగా ఒక్కసారిగా కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో మరోసారి లాక్‌డౌన్‌ను సైతం విధించే పరిస్థితులు వచ్చాయి. అయితే ప్రజల్లో పెరగుతోన్న బాధ్యత రాహిత్యమే కేసుల సంఖ్య పెరగడానికి కారణాలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు. సోషల్‌ డిస్టెంట్స్‌ పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం వల్ల కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. అయితే లాక్‌డౌన్‌ సమయంలో దుకాణాలు, పాఠశాలలు అన్ని మూసి ఉన్నాయి కాబట్టి.. వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కానీ ప్రస్తుతం ప్రభుత్వాలు అన్ని నిబంధనలు ఎత్తివేయడంతో జనాలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా రిటైల్‌ స్టోర్‌లు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద జన సంచారం విపరీతంగా పెరుగుతోంది. ఇది వైరస్‌ సామాజిక వ్యాప్తికి దోహదపడనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిటైల్‌ స్టోర్‌ల వద్ద ఓ సరికొత్త విధానాన్ని అవలంభించి వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. జనాలు పెద్ద ఎత్తున ఉండే రిటైల్‌ స్టోర్‌లాంటి ప్రదేశాల్లో ‘వన్‌ వే ట్రాఫిక్‌’ విధానాన్ని పాటించడం ద్వారా కొవిడ్‌ -19 వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం అభిప్రాయమే కాకుండా ఓ పరిశోధనను నిర్వహించి మరీ నిపుణులు ఈ అంచనాకు వచ్చారు. సూపర్‌ మార్కెట్లలో వినియోగదారులను ఒకే వరుసలో వెళ్లేలా కొన్ని నియంత్రణ మార్గాలను పాటించడం ద్వారా కొవిడ్‌-19 వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని చెప్పుకొచ్చారు. వినియోగదారులు ఒకరికి ఒకరు ఎదురు పడుకుండా చర్యలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఇది సదరు స్టోర్‌ కెపాసిటీ, వెంటిలేషన్‌పై ఆధారపడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విధానాన్ని పాటించినప్పటికీ ఇందులోనూ కొన్ని సమస్యలున్నాయని చెప్పుకొచ్చారు. దీని ద్వారా కేవలం డైరెక్ట్‌ కాంటాక్ట్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందకపోయినా.. ఇతర వస్తువుల ద్వారా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే ప్రమాదం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Corona: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు.. నిన్న ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

Covid-19 Guidelines: కోవిడ్-19 మార్గదర్శకాలను పొడిగించిన కేంద్రం ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ

Covid-19: వారు మా రాష్ట్రానికి వస్తే.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిందే: రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు