Covid-19 Guidelines: కోవిడ్-19 మార్గదర్శకాలను పొడిగించిన కేంద్రం ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ

Covid-19 Guidelines: దేశంలో కరోనా మహహ్మారి తగ్గుముఖం పట్టినా..మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో మరింత...

Covid-19 Guidelines: కోవిడ్-19 మార్గదర్శకాలను పొడిగించిన కేంద్రం ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ
Follow us

|

Updated on: Feb 26, 2021 | 8:25 PM

Covid-19 Guidelines: దేశంలో కరోనా మహహ్మారి తగ్గుముఖం పట్టినా..మళ్లీ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌-19పై నిఘా పెట్టేందుకు మార్చి 31 వరకు మార్గదర్శకాలను పొడిగిస్తున్నట్లు కేంద్ర సర్కార్‌ వెల్లడించింది. కోవిడ్‌ -19 మహమ్మారి మధ్య నిఘా, నియంత్రణ మరియు జాగ్రత్తల కోసం ప్రస్తుత మార్గదర్శకాలను విస్తరించాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దేశవ్యాప్తంగా ఇటీవల తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు కాస్త.. మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం పలు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఏడు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోందని.. ఆ రాష్ట్రాల్లో 90శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్రం సర్కార్‌ వెల్లడించింది.

అత్యధికంగా మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలలో మొదటి స్థానంలో ఉంది. ఆతరువాత వరుసగా.. కేరళ, పంజాబ్, తమిళనాడు, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా16,577 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,63,491 (1.10కోట్లు) కు చేరిందని వెల్లడించింది. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా గత 24గంటల్లో దేశవ్యాప్తంగా 120 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,56,825కు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. అలాగే కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా.. డిశ్చార్జ్‌ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. నిన్న కరోనా నుంచి 12,179 మంది బాధితులు మాత్రమే కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు 1,07,50,680 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ (Union Health Ministry) వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,55,986 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే దేశంలో మళ్లీ యాక్టివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆందోళన మొదలైంది.

దేశంలో రికవరీ రేటు:

కాగా, దేశంలో కోవిడ్‌-19 రికవరీ రేటు 97.17 శాతానికి చేరగా.. మరణాల రేటు 1.42 శాతంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. నిన్న దేశవ్యాప్తంగా 8,31,807 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి ఫిబ్రవరి 25వ తేదీ వరకు మొత్తం 21,46,61,465 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్స్ పేర్కొంది.

కరోనా వ్యాక్సినేషన్‌:

కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ (Covid-19 vaccination) పక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 1,34,72,643 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకూ.. ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మార్చి 1 నుంచి 60ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే.

దేశవ్యాప్తంగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో.. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్ విధించగా.. పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. ప్రయాణికులు తమ రాష్ట్రాల్లోకి రావాలంటే.. ముందస్తుగా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశాయి.

మహారాష్ట్రలో భయాందోళన కలిగిస్తున్న కేసులు:

కాగా, దేశ వ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతుంటే మహారాష్ట్రలో మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోవడంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేస్తున్నారు. కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు మరిన్ని ఆంక్షలు విధిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలో అడుగు పెట్టే వారిపై నిఘా పెట్టారు. కరోనా నెగెటివ్‌ రిపోర్టుతో వస్తే రాష్ట్రంలోకి అనుమతి ఇస్తున్నారు. అలాగే మాస్కులు ధరించని వారిపై కూడా కొరఢా ఝులిపిస్తున్నారు. మాస్కులు ధరించని వారికి భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాదిలో కోట్లాది రూపాయలుగా మాస్కులు ధరించని వారిపై వసూలు చేసినట్లు ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ తెలిపింది. మరిన్ని ఆంక్షలు విధిస్తేనే కరోనా కట్టడిలోకి వస్తుందని భావించిన అధికారులు.. నిబంధనలు కఠినతరం చేస్తున్నారు.

Also Read: Covid-19: వారు మా రాష్ట్రానికి వస్తే.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిందే: రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..