Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఇంటికి సమీపంలో అనుమానాస్పద కారు.. అందులో పేలుడు పదార్థాలు.. తాజాగా మరో ట్విస్ట్…

ప్రముఖ బిజినెస్‌మేన్ ముకేశ్​ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో కలకలం రేపిన కారు వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఆ కారు కొంతకాలం క్రితం చోరీకి గురైందని అధికారులు వెల్లడించారు.

Mukesh Ambani:  ముఖేష్ అంబానీ ఇంటికి సమీపంలో అనుమానాస్పద కారు.. అందులో పేలుడు పదార్థాలు.. తాజాగా మరో ట్విస్ట్...
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 26, 2021 | 8:54 PM

Mukesh Ambani House: ప్రముఖ బిజినెస్‌మేన్ ముకేశ్​ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో కలకలం రేపిన కారు వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. ఆ కారు కొంతకాలం క్రితం చోరీకి గురైందని అధికారులు వెల్లడించారు. ఆ కారు అసలు ఓనర్ హిరెన్​ మన్​సుఖ్​.. వారం క్రితం దీనిపై కంప్లైంట్ చేసినట్లు చెప్పారు. గురువారం.. అంబానీ ఇంటికి దగ్గర్లో పార్కు​ చేసి ఉన్న కారు దృశ్యాలు చూసిన తర్వాత మన్​సుఖ్​.. పోలీసు కమిషనర్ ఆఫీసుకు వచ్చారని చెప్పారు.

వివరాల్లోకి వెళ్తే…

ఠాణె జిల్లాకు చెందిన మాన్​సుఖ్​.. ఫిబ్రవరి 17న ఓ ఫంక్షన్‌కు వెళ్తుండగా కారు చెడిపోవడం వల్ల ఐరోలీ ములుండ్​ బ్రిడ్జ్​ దగ్గర్లో పార్కు చేశారు. తర్వాత రోజు కారును తెచ్చుకోవడానికి వెళ్లగా.. అక్కడ అది కనిపించలేదు. నాలుగు గంటలు పాటు వెతికిన తర్వాత కారు పోయినట్లు గుర్తించి.. పోలీసులకు కంప్లైంట్  చేశానని మన్​సుఖ్​ చెప్పారు. అంబానీ నివాసం దగ్గర్లో పేలుడు పదార్థాల కారు పార్కింగ్ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా.. ఈ ఘటనతో సంబంధం ఉన్న గుర్తుతెలియని కొందరి వ్యక్తులపై గామ్​దేవి పోలీసు స్టేషన్​లో ఎఫ్​ఐఆర్​ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ఆ కారులో ఓ లేఖ కూడా లభించినట్లు తెలిపారు. “ఇది చిన్నట్రైలర్​ మాత్రమే. వచ్చేసారి బాంబులు పేలేలా పెడతాము” అని రాసి ఉన్నట్టు సమాచారం.

అసలేం జరిగిందంటే…

ముంబైలోని గామ్‌దేవి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం కార్మిచీల్ రోడ్డులో అనుమానాస్పద వాహనాన్ని గుర్తించారు. ఈ వాహనంపై స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. హుటాహుటి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనం ఉన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. వాహనం లోపల జెలిటిన్‌ను గుర్తించారు. ఇది ఒక రకమైన పేలుడు పదార్థం కాగా, అది ఇంకా మాంటేజ్ కాలేదు. ఇదిలాఉంటే.. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇల్లు పేలుడు పదార్థాలు దొరికిన ప్రదేశానికి చాలా దగ్గరగా ఉంది. దాంతో ఈ సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి ముఖేష్ అంబానీ ఇంటి బయట భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇది గుర్తు తెలియని వ్యక్తులు కావాలని బెదిరించడానికే ఇలాంటి ప్రయత్నం చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముంబై పోలీసులకు ముందుగా సమాచారం లభించింది. దాంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తరువాత వారు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. స్థానిక డిసిపి, ఎసిపిలతో పాటు బాంబు స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారు లోపల నుంచి పేలుడు పదార్థాలను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం కారును సీజ్ చేశారు పోలీసులు. అయితే, ఈ కారులో ఒక లేఖ దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ముఖేష్ అంబానీ ఇంటి పరిసరాల్లో ఉన్న సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

Also Read:

పశువుల పాకలో ఉరికి వేలాడిన మహిళ.. అందరూ ఆత్మహత్యే అనుకున్నారు.. కానీ చిక్కుముడి ఇలా వీడింది

అహ్మదాబాద్‌ టెస్ట్ మ్యాచ్‌కు అరుదైన ఘనత.. రెండవ ప్రపంచ యుద్దం తర్వాత అతి తక్కువ సమయంలోనే…!

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్