Crime News: పశువుల పాకలో ఉరికి వేలాడిన మహిళ.. అందరూ ఆత్మహత్యే అనుకున్నారు.. కానీ చిక్కుముడి ఇలా వీడింది

ప్రకాశం జిల్లాలో వివాహిత ఆత్మహత్య కేసు ఊహించని టర్న్ తీసుకుంది. ముందు ఆమే బలవన్మరణానికి పాల్పడిందని బంధువులు సహా అందరూ భావించారు. కానీ ఇక్కడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Crime News: పశువుల పాకలో ఉరికి వేలాడిన మహిళ.. అందరూ ఆత్మహత్యే అనుకున్నారు.. కానీ చిక్కుముడి ఇలా వీడింది
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 26, 2021 | 7:27 PM

Crime News: ప్రకాశం జిల్లాలో వివాహిత ఆత్మహత్య కేసు ఊహించని టర్న్ తీసుకుంది. ముందు ఆమే బలవన్మరణానికి పాల్పడిందని బంధువులు సహా అందరూ భావించారు. కానీ ఇక్కడే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భర్త, మామలు లొంగిపోవడంతో మలుపులకు పులుస్టాప్ పడింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు తాజాగా పోలీసులు వెల్లడించారు. ముండ్లమూరు మండలం పెద ఉల్లగల్లుకు చెందిన గురులింగం కుమారుడు శ్రీనివాసులు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన శైలజ నాలుగేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ జంటకు ఇప్పటికే ఒక బాబు ఉన్నాడు.. తాజాగా శైలజ మూడు నెలల ప్రెగ్నెంట్.

కాగా అనూహ్యంగా  ఈ నెల 20న శైలజ ఇంటి పక్కనే ఉన్న పశువులపాకలో ఉరి వేసుకుని తనువు చాలించింది. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతురాలి బంధువులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక దర్యాప్తులో డెడ్‌బాడీపై గాయాలున్నట్లు స్పష్టమైంది. దీంతో పోలీసులకు అనుమానాలు మొదలయ్యాయి. ఇక చేసిన నేరం తప్పక బయటపడుతుందని భావించిన భర్త శ్రీనివాసులు, మామ గురు లింగం పోలీసుల ముందు లొంగిపోయి.. అసలు విషయం వెల్లడించారు

శైలజ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు భర్త శ్రీనివాసులు అంగీకరించాడు.  ఈ నెల 20న అర్ధరాత్రి నిద్రపోతున్న శైలజ మెడపై కాలితో తొక్కి హతమార్చినట్టు పోలీసులు చెప్పాడు.  ఇందుకు తన తండ్రి గురులింగం సహకరించాడని.. ఆత్మహత్యగా నమ్మించడానికి శైలజకు పశువులపాకలో చీరతో ఉరివేసినట్లు అసలు విషయం చెప్పేశాడు. ఇదే విషయంపై తమ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. గొడవలు కూడా జరిగినట్లు పూర్తి వివరాలు చెప్పేశాడు. అక్రమ సంబంధాల వల్ల.. జరుగుతున్న క్రైమ్స్ అన్నీ, ఇన్నీ కావు. రోజూ ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. లేనిపోని మోహాల్లో పడి కొందరు బిడ్డల జీవితాలతో పాటు తమ జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. వీటికి చరమగీతం పాడాల్సిన అవసరం కనిపిస్తుంది.

Also Read:

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు.. దడ పుట్టిస్తున్న తాజా రిపోర్ట్

Viral News: తండ్రి అస్థికలను బీరులో కలిపి.. పబ్ ఎదురుగా ఉన్న డ్రైనేజ్‌లో కలిపిన కొడుకు.. ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?

Sonu Sood: ఆ ఊరి నీటి సమస్య తీర్చాడు.. కన్నీళ్లను తుడిచాడు.. ఇంకెవరు మన కలియుగ కర్ణుడు..

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో