AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Sood: ఆ ఊరి నీటి సమస్య తీర్చాడు.. కన్నీళ్లను తుడిచాడు.. ఇంకెవరు మన కలియుగ కర్ణుడు..

సోనూ సూద్.. ఒకప్పుడు రీల్ విలన్.. ఇప్పుడు రియల్ హీరో. ఎన్నో వేలమందికి ఆయన ఆరాధ్యదైవంగా  మారిపోయాడు. కరోనా లాక్​డౌన్​లో వలస కూలీల కష్టాలు చూసి చలించిపోయిన ఆయన.. వారికోసం ప్రత్యేక వసతిశాలలను ఏర్పాటు చేశాడు.

Sonu Sood: ఆ ఊరి నీటి సమస్య తీర్చాడు.. కన్నీళ్లను తుడిచాడు.. ఇంకెవరు మన కలియుగ కర్ణుడు..
Ram Naramaneni
|

Updated on: Feb 26, 2021 | 8:04 PM

Share

సోనూ సూద్.. ఒకప్పుడు రీల్ విలన్.. ఇప్పుడు రియల్ హీరో. ఎన్నో వేలమందికి ఆయన ఆరాధ్యదైవంగా  మారిపోయాడు. కరోనా లాక్​డౌన్​లో వలస కూలీల కష్టాలు చూసి చలించిపోయిన ఆయన.. వారికోసం ప్రత్యేక వసతిశాలలను ఏర్పాటు చేశాడు. మరికొందర్నీ ప్రత్యేక బస్సుల ద్వారా సొంతూర్లకు చేర్చాడు. సాయం అంటే చాలు ఎగబడి వెళ్లిపోతున్నాడు ఈ రియల్ హీరో.  మరోసారి మంచి మనసు చాటుకున్నారు ఈ స్టార్ యాక్టర్. ఉత్తరప్రదేశ్​లోని ఝాన్సీ గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్న నీటి సమస్యను తీర్చి.. వారి కన్నీటి తుడిచాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్వీట్ చేశారు.

ఝాన్సీ గ్రామంలోని కొందరు వ్యక్తులు తమ ఊరిలోని నీటి సమస్య గురించి సోనూసూద్‌తో చెప్పారు. నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని, అందువల్ల పిల్లలు, కుటుంబాలు చాలా కష్టాలు పడుతున్నాయని అతడి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అర్జీలు పెట్టిన పని అవ్వడంలేదని.. ఎవ్వరూ తమని పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో చలించిపోయిన సోనూ‌సూద్.. వారి కోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ ఊరిలో చేతిపంపుల్ని ఏర్పాటు చేయించాడు. బోర్ వేస్తున్నప్పుడు ఉరి వాళ్లంతా అక్కడి నిల్చుని చాలా ఆసక్తితో దానిని చూశారని.. ఆ విషయం తన మనసును చాలా హత్తుకుందని సోనూసూద్‌ ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. ఏదో ఓ రోజు నేను తాను కూడా ఆ పంపు నీళ్లు తాగేందుకు వెళ్తానని చెప్పాడు. తనకి కూడా అది చాలా ప్రత్యేకమే కదా అని సోనూసూద్ చెప్పుకొచ్చారు. ఇక సినిమాల  విషయానికి వస్తే..  ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’, బాలీవుడ్​లో అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’, ‘కిసాన్’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇటీవల ఈ-రిక్డాలు అందించాడు….

ఇటీవల స్వస్థలం పంజాబ్‌లోని మోగా పట్టణంలో ఎనిమిది మంది నిరుద్యోగులకు ఈ-రిక్షాలు అందించారు సోనూ సూద్ . ఈ కార్యక్రమంలో ఆయన సోదరి మాళవిక సచార్, బావ గౌతమ్‌ సచార్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు విషయాలు తెలియజేవారు. దేశవ్యాప్తంగా 150 ఈ-రిక్షాలు పంచాలని నిర్ణయించుకున్నానని, దీంతో కొంతమందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ అవసరమైన వారికి తోచినంత సాయం చేయండి. నేను నా తల్లిదండ్రుల నుంచి ఈ సేవా గుణాన్ని అలవర్చుకున్నానని ప్రకటించారు. నేను దేవుణ్ని కాదని అందరిలాగే అవసరమైన వారికి సాయం చేస్తూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నానని గుర్తుచేశారు.

తెలుగు ఇండస్ట్రీపై సోనూసూద్‌ ఆసక్తికర వ్యాఖ్యలు:

ఇటీవల సోనుసూద్‌ తెలుగు ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోనూ మాట్లాడుతూ.. ‘నేను బాలీవుడ్‌, తమిళ ఇండస్ట్రీ.. ఇలా ఏ వేదికపై ఉన్నా తెలుగు ఇండస్ట్రీనే నాకు మొదటి ప్రేమ అని కచ్చితంగా చెబుతాను. నేను సినిమాల్లో నేర్చుకుంది ఏదైనా ఉందంటే అది తెలుగు ఇండస్ట్రీ ద్వారానే. కాబట్టి తెలుగు సినిమాకు నా ధన్యవాదాలు. నా భార్య తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి.. కాబట్టి నేను తెలుగు అల్లుడిని’ అంటూ వ్యాఖ్యానించాడు.

Also Read:

Viral News: తండ్రి అస్థికలను బీరులో కలిపి.. పబ్ ఎదురుగా ఉన్న డ్రైనేజ్‌లో కలిపిన కొడుకు.. ఇలా ఎందుకు చేశాడో తెలుసా..?

తెలంగాణలో వ్యక్తి మరణానికి కారణమైన కోడి అరెస్టు.. ఏ1 ముద్దాయి అట.. కోడి కూతలతో స్టేషన్‌లో మోత

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు.. దడ పుట్టిస్తున్న తాజా రిపోర్ట్