AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో వ్యక్తి మరణానికి కారణమైన కోడి అరెస్టు.. ఏ1 ముద్దాయి అట.. కోడి కూతలతో స్టేషన్‌లో మోత

ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. సంఘటనా స్థలంలో సాక్షాధారాలను సేకరిస్తారు. ప్రాథమికంగా అనుమానితులు ఎవరైనా ఉంటే.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా...

తెలంగాణలో వ్యక్తి మరణానికి కారణమైన కోడి అరెస్టు.. ఏ1 ముద్దాయి అట.. కోడి కూతలతో స్టేషన్‌లో మోత
కోడి అరెస్ట్..ఎందుకంటే..?
Ram Naramaneni
|

Updated on: Feb 26, 2021 | 5:52 PM

Share

ఏదైనా క్రైమ్ జరిగితే వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతారు. సంఘటనా స్థలంలో సాక్షాధారాలను సేకరిస్తారు. ప్రాథమికంగా అనుమానితులు ఎవరైనా ఉంటే.. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. నిందితులు ఎవరైనా, ఎంతటివారైనా వారిని అదుపులోకి తీసుకుని.. నిజాలను నిర్ధారించి.. దోషులకు శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మరణించిన ఓ వ్యక్తి విషయంలోనూ పోలీసులు తమ డ్యూటీ చేశారు. సదరు వ్యక్తి మృతికి ఓ కోడి కారణమని నిర్ధారించిన పోలీసులు… హత్యా నేరం కింద దాన్ని అదుపులోకి తీసుకున్నారు.

అసలు ఏం జరిగిందంటే..?

కోడి పందేల సరదా ఓ మనిషి ప్రాణం తీసింది. అకస్మాత్తుగా జరిగిన ఘటనతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే… జగిత్యాల జిల్లా గొల్లపల్లి పరిధిలోని లొత్తునూర్ శివారులో కోడి పందేలు నిర్వహించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు కోళ్లు తీసుకుని.. పందేల్లో పాల్గొనేందుకు వచ్చారు. వెల్గటూరు మండలం కొండాపూర్ కు చెందిన తనుగుల సతీష్ (45) కూడా తన కోడితో అక్కడికి చేరుకున్నాడు.

పందేలు తిలకించేందుకు జనాలు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఈ క్రమంలోనే సతీష్ తన కోడిని బరిలోకి దించేందుకు కోడి కాలికి కత్తిని కట్టాడు. ఓ పక్కన కూర్చుని పందెం సమయం కోసం ఎదురుచూస్తున్నారు. అధిక సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి.. కోడి బెదిరి తప్పించుకోబోయింది. ఈ క్రమంలో కోడిని కదలకుండా పట్టుకునేందుకు సతీష్ ప్రయత్నించాడు. దీంతో అప్పటికే దాని కాలికి కట్టిన కోడి కత్తి సతీష్ మర్మాంగానికి తగిలింది. దీంతో అతడి పురుషాంగం, వృషణాలకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో సతీష్  కుప్పకూలిపోయాడు.  అక్కడున్న వారు అతడ్ని హుటాహుటిన జగిత్యాల ఏరియా హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నం చేశారు. అయితే సతీష్ దారిలోనే మృతిచెందాడు. . సతీష్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. సతీశ్​ మరణించడానికి సదరు కోడి కారణమని తేల్చారు. కోడిని హత్యా నేరం కింద ఏ1 ముద్దాయిగా అరెస్ట్ చేశారు. పోలీస్​స్టేషన్​లోనే దాణా ఏర్పాటు చేసి జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇది విషయం.. నేరస్థులు ఎవరైనా తమ ట్రీట్మెంట్ ఒకే రకంగా ఉంటుందని చెప్పకనే చెప్పారు. మనిషి ప్రాణం పోవడానికి కారణమైన కోడి పుంజును అయితే అర్టెస్ట్ చేశారు బాగానే ఉంది. మరి దానికి ఎలాంటి శిక్ష వేస్తారు?  పోలీసుల నెక్ట్స్ స్టెప్ ఏంటన్నది ?  ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరి నేరం చేసిన కారణంగా పోలీసుల అదుపులో ఉన్న ఈ కోడి ఫ్యూచర్ ఏంటో తెలియాలంటే మరికొంతకాలం ఎదురు చూడాల్సిందే.

Also Read:

  1. India vs England: అహ్మదాబాద్‌ టెస్ట్ మ్యాచ్‌కు అరుదైన ఘనత.. రెండవ ప్రపంచ యుద్దం తర్వాత అతి తక్కువ సమయంలోనే…!
  2. Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు.. దడ పుట్టిస్తున్న తాజా రిపోర్ట్
Follow Us
ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌గా రెడీ.. త
ఇలా చేస్తే ఉదయం వేళల్లో 2 నిమిషాల్లోనే బ్రేక్‌ ఫాస్ట్‌గా రెడీ.. త
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
IPLలో సెన్సేషన్.. హీరోయిన్ జూహీ చావ్లా కూతురిని చూశారా.. ?
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
క్షమించు ఆయేషా.. కాసిన్ని కన్నీళ్లు తప్ప నీకు ఏం ఇవ్వలేకపోయాం..
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
కొంప ముంచిన వరుడి అతి విశ్వాసం..!
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ పోరు ఫిక్స్.. ట్విస్ట్ అదిరిపోలా..?
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
ఆహా ఏమి రుచి.. చుక్క నూనె లేకుండా టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై..
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. ఫొటోలు వైరల్
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
కోల్‌కతాలో భారీ భూకంపం.. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన జనాలు
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
మీ తల రాతను మార్చే ఫొటోలు ఇవే.. ఇంట్లో ఉంటే లక్కే లక్కు!
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్
చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుతచికిత్స..నో సైడ్ ఎఫెక్ట్స్