India vs England 2021: అహ్మదాబాద్‌ టెస్ట్ మ్యాచ్‌కు అరుదైన ఘనత.. రెండవ ప్రపంచ యుద్దం తర్వాత అతి తక్కువ సమయంలోనే…!

నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి నాలుగు సెషన్లకు తక్కువ సమయం మాత్రమే తీసుకుంది. రెండు రోజుల లోపలే ఇండియా ఇంగ్లాండ్‌ను ఓడించి...

India vs England 2021: అహ్మదాబాద్‌ టెస్ట్ మ్యాచ్‌కు అరుదైన ఘనత.. రెండవ ప్రపంచ యుద్దం తర్వాత అతి తక్కువ సమయంలోనే...!
తొలిమ్యాచ్‌తోనే సంచలన రికార్డులకు కేరాఫ్‌గా నిలిచిన నరేంద్ర మోడీ స్టేడియం..
Follow us

|

Updated on: Feb 26, 2021 | 3:30 PM

India vs England: నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ రిజల్ట్ ఇవ్వడానికి నాలుగు సెషన్లకు తక్కువ సమయం మాత్రమే తీసుకుంది. రెండు రోజుల లోపలే ఇండియా ఇంగ్లాండ్‌ను ఓడించి, రెండవ ప్రపంచ యుద్ధం (1939-1945 ) తర్వాత పూర్తి చేసిన  షార్ట్ టైమ్ టెస్టుగా నిలిచింది. 1946 లో వెల్లింగ్టన్లో జరిగిన న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లో 145.2 ఓవర్లు బౌలింగ్ చేయబడ్డాయి.  తాజాగా ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్ డే-నైట్ టెస్ట్ కేవలం 140.2  ఓవర్లు మాత్రమే బౌలింగ్ జరిగింది. తాజా టెస్టులో రెండవ రోజు మొత్తం 17 వికెట్లు పడ్డాయి. స్పిన్నర్లు అక్సర్ పటేల్, రవి అశ్విన్, వాషింగ్టన్ సుందర్ తమ మధ్య మొత్తం పది వికెట్లు తీశారు. అక్సర్‌కు ఐదు వికెట్లు పడగా, అశ్విన్ నాలుగు, సుందర్ ఒక వికెట్ పడగొట్టారు.

1932 లో ఆస్ట్రేలియా వెర్సస్ దక్షిణాఫ్రికా మ్యచ్ అతి తక్కువ సమయంలో ముగిసిన మ్యాచ్‌గా రికార్డు సృష్టించింది. అయితే ఆ టెస్ట్‌లో 109.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయబడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్ మధ్య మూడవ టెస్ట్ ఇప్పుడు భారతదేశంలో పూర్తి చేసిన షార్ట్ టైమ్ టెస్ట్.  తాజా టెస్ట్ 2019 లో ఇండియా వెర్సస్ బంగ్లాదేశ్ రికార్డును అధిగమించింది. ఈ విజయంతో, భారత్ ఇప్పుడు నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంకో మ్యాచ్ జరగాల్సి ఉంది.  ఇంగ్లండ్ ఓడిపోవడంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరంగా ఉండనుంది. భారత్‌ ముందుకు వెళ్లాలంటే నాల్గవ టెస్టులో విజయం లేదా డ్రా అవసరం. 

అహ్మదాబాద్ టెస్ట్‌లో టీమ్ ఇండియా కేవలం రెండు రోజుల్లో అద్భుత విజయం సాధించి చరిత్ర సృష్టించింది. నాలుగు-మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లు సమానంగా ఉండటంతో మూడో మ్యాచ్‌పైనే అందరి దృష్టి ఉంది. కారణం ఈ మ్యాచ్ గెలిచిన జట్టే సిరీస్‌లో ఆధిక్యంలో ఉంటుంది. కానీ అహ్మదాబాద్‌ టెస్ట్ మ్యాచ్‌ తరువాత ఇంగ్లండ్ టీమ్ సిరీస్ గెలుస్తుందనే ఆశ సన్నగిల్లిందనే చెప్పాలి. ఇక ప్రపంచంలోని అతిపెద్దదైన నరేంద్ర మోడీ స్టేడియంలో రికార్డుల మోత మోగింది.

1. అశ్విన్ తరువాత రెండవ స్పిన్నర్‌గా నిలిచిన అక్షర్ పటేల్‌

అహ్మదాబాద్ టెస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇది అతని రెండవ టెస్ట్ మ్యాచ్. అంతకుముందు, చెన్నై రెండో టెస్టులో అరంగేట్రం చేస్తూ, ఇన్నింగ్స్ మొత్తంలో ఏడు వికెట్లు సాధించి చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్ టెస్ట్‌లో రెండవ ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ మొదటి ఓవర్ వేశాడు. ఆ ఓవర్ తొలి బంతికే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జాక్ క్రౌలీని అవుట్ చేశాడు. దీంతో టెస్టు తొలి బంతికి వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్ తర్వాత రెండో స్పిన్నర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు. కాగా, చెన్నైలో ఆడిన తొలి టెస్టులో అశ్విన్ ఈ ఘనత చేశాడు.

2. ఇషాంత్ శర్మ ఫీట్: 14 సంవత్సరాల కెరీర్‌లో మొదటి సిక్స్..

అహ్మాదాబాద్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ ఇషాంత్ శర్మ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో 100వ టెస్ట్. ఈ మ్యాచ్ అతనికి చారిత్రాత్మకంగా నిలిచిపోనుందనే చెప్పాలి. ఎందుకంటే.. 100వ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ తొలిసారి సిక్సర్ కొట్టాడు. దాంతో ఈ మ్యాచ్ అతని కెరీర్‌లో మరింత గుర్తుండిపోయేలా చేశాడు. ఇక ఇషాంత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌లో ఇదే మొదటి సిక్స్. ఇషాంత్ శర్మ 2007లో అరంగేట్రం చేసినప్పటి నుండి 100 టెస్టులు, 80 వన్డేలు ఆడగా.. 14 టి20 ఇంటర్నేషనల్స్ లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లన్నింటిల్లో ఇషాంత్ సుమారు 2677 బంతులను ఎదుర్కొన్నాడు.

3. 5 వికెట్లు పడగొట్టిన జో రూట్..

ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ పార్ట్ టైమ్ బౌలర్ అయినప్పటికీ.. అహ్మదాబాద్ టెస్ట్‌లో కీరోల్ పోషించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను పూర్తిగా దెబ్బతీసింది రూట్ అనే చెప్పాలి. భారత్ తొలి ఇన్నింగ్‌లో రూట్ 5 వికెట్లు పడగొట్టి కష్టాల్లోకి నెట్టాడు. అద్భుతమైన స్పిన్‌తో టీమిండియా బౌలర్లను కట్టడి చేశాడు. 3 వికెట్ల నష్టానికి 99 పరుగులతో టీమిండియా బ్యాటింగ్ చేస్తోంది. ఆ సమయంలో ఎంటరైన రూట్.. టీమిండియాను 143 పరుగులకు కట్టడి చేశాడు. 6.3 ఓవర్లు వేసిన రూట్.. కేవలం 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఏ స్పిన్నర్‌కైనా ఇదే అత్యంత కీలక వికెట్లు అని చెప్పాలి. ఇక.. రూట్ మొత్తం క్రికెట్ కెరీర్‌లో 5 వికెట్లు తీసుకోవడం ఇదే తొలిసారి.

4. జో రూట్ డబుల్ రోల్ : డబుల్ సెంచరీ, 5 వికెట్లు..

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ రెండు అద్భుతాలు చేశాడు. చెన్నై టెస్టులో డబుల్ సెంచరీ చేసిన జో రూట్.. తాజా మ్యాచ్‌లో అదే ప్రదర్శనను కనబరిచాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో డబుల్ సెంచరీ సాధించడంతో పాటు, అతని పేరు మీద ఐదు వికెట్లు పడగొట్టాడు. దీనికి ముందు ఇలా పాకిస్తాన్‌కు చెందిన వసీం అక్రమ్ 1996 లో జింబాబ్వేపై ఈ రికార్డ్‌ను నమోదు చేశాడు.

Also Read: Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణాలు తీస్తున్న వివాహేతర సంబంధాలు.. దడ పుట్టిస్తున్న తాజా రిపోర్ట్

Also Read: భూమికి మనం ఏలియన్స్‌గా వచ్చామా..? మార్స్‌ మన సొంత ఊరా..?.. ఆసక్తికర వివరాలు మీ కోసం..

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే