Mars: భూమికి మనం ఏలియన్స్‌గా వచ్చామా..? మార్స్‌ మన సొంత ఊరా..?.. ఆసక్తికర వివరాలు మీ కోసం..

భూమికి మనం ఏలియన్స్‌గా వచ్చామా..? మార్స్‌ మన సొంత ఊరా..? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదండీ..? కానీ.. ఈ కొత్త వాదనలో నిజముందంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు..

Mars: భూమికి మనం ఏలియన్స్‌గా వచ్చామా..? మార్స్‌ మన సొంత ఊరా..?.. ఆసక్తికర వివరాలు మీ కోసం..
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 25, 2021 | 9:32 PM

Mars: భూమికి మనం ఏలియన్స్‌గా వచ్చామా..? మార్స్‌ మన సొంత ఊరా..? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదండీ..? కానీ.. ఈ కొత్త వాదనలో నిజముందంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు.. డార్విన్‌ జీవ పరిణామ క్రమ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా.. మార్స్‌పై జీవం మనుగడకు సంబంధించిన అనవాళ్లను చూపిస్తున్నారు. అసలు.. అంగారకుడిపై.. మన పుట్టింటికి సంబంధించిన రుజువులేంటి?మనిషి ఆశలకు అంగారకుడే హద్దు..! అందుకే… మనిషి రెక్కలు తొడుక్కోకపోయినా.. ఆశలకు విజ్ఞానపు రెక్కలు తొడిగి.. మార్స్‌ను అందుకుంటున్నాడు.

అంగారకుడిపై పలు పరిశోధనలు.. సైంటిస్టుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. అంగారకునిపై వాతావరణం, భౌగోళిక పరిస్థితులు, నీటి జాడలు, జీవం ఉనికిపై పరిశోధనల్లో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మార్స్ మీద ఇప్పటికే విపరీతమైన రేడియేషన్ ఉందని.. దాని వల్లే అక్కడ సముద్రాలు, నీరు, జీవజాలం అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఐదు వందల కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు ఏర్పడ్డాడు. అప్పట్లో విపరీతమైన రేడియేషన్‌ వెలువడింది. ఆ రేడియేషన్‌ ఇప్పటికీ సౌర వ్యవస్థలో అలాగే ఉంది.  ఆ రేడియేషన్‌ ప్రభావం భూమి మీద పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉన్నాయి. భూమి చుట్టు ఉండే అయస్కాంత వలయాలు ఈ రేడియేషన్‌ భూమిని చేరకుండా అడ్డుకుంటున్నాయి. అయితే.. మార్స్‌కు ఇటువంటి రక్షణ వ్యవస్థ ఏమీ లేదు. ఈ రేడియేషన్‌ ప్రభావం అక్కడి వాతావరణంపై పడుతుంది. భవిష్యత్తులో మార్స్‌పైకి వెళ్లే వ్యోమగాములకు ఈ రేడియేషన్‌ నుంచి పెనుముప్పు పొంచి వుంది. అలానే మార్స్‌ మీద ఆక్సిజన్‌ పరిమాణం కూడా చాలా తక్కువ. మార్స్‌ మీద వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అక్కడి సాధారణ ఉష్ణోగ్రతలు మైనస్‌ 130 డిగ్రీల నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉంటాయి. మార్స్‌ అంతా రాళ్లు, ఎడారులే కనిపిస్తాయి. ఇక్కడ పేరుకుపోయిన ధూళి పొరల క్రింద గ్లేషియర్లు దాగున్నాయని.. శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక్కడ ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నా వాటిని అనుకూలంగా మార్చుకునే అవకాశాలు బాగా ఉన్నాయన్నదే సైంటిస్టుల ధీమా..

ఈక్రమంలోనే.. అసలు.. అంగారక గ్రహమే.. మన పుట్టినిల్లుగా చెబుతున్నారు కొందరు శాస్త్రవేత్తలు. మనం అంగారక గ్రహం నుంచి భూమికి.. గెస్ట్‌లుగా వచ్చామంటున్నారు. డార్విన్ జీవ పరిణామ క్రమ సిద్ధాంతం అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి పుస్తకాలలో చదువుకుంటూనే ఉన్నాం. ఏక కణ జీవి నుంచి మొదలైన మనిషి కోతి నుంచి ఎలా పరిణామం చెందుతూ వచ్చాడు అన్నది డార్విన్‌ థియరీ సారాంశం. పరిణామక్రమంలో కోతి నుంచి మనిషి ఎలా పరివర్తన చెందాడు అన్నది డార్విన్ చెప్పిన సిద్ధాంతం. కానీ, ఈ ధియరీని మొదటి నుంచి వ్యతిరేకించే శాస్త్రవేత్తలు చాలా మందే ఉన్నారు.

దాదాపు 3 కోట్ల జీవజాలాలకి… ఈ భూమితో సంబంధం ఉంది. వీటి వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం లేదు. భూమితో.. ప్రత్యక్షంగా పరోక్షంగా వీటన్నింటికీ విడదీయలేని అవినాభావన సంబంధం ఉంది… కానీ… ఒక్క మనిషి నిర్మాణం మాత్రమే ఈ భూమి మీద తేడాగా ఉంది. మనిషి వల్లే భూమికి ముప్పు పొంచి ఉన్న మాట కూడా నిజం….! ఎందుకంటే మనిషిది కాదు ఈ భూమి. మనిషి ఈ భూమికి ఏలియన్‌గా వచ్చాడని అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. అంటే ఇతర గ్రహాల నుంచి వచ్చి ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాడంటున్నారు. కానీ.. కొందరు శాస్త్రవేత్తలు ఈ వాదనలను కొట్టి పారేస్తున్నారు.

కొన్ని వేల సంవత్సరాల్లో ఎక్కడో మధ్యలో…. ఎక్కడో ఒకసారి దాదాపు మనిషి భూమి మీద అంతరించిపోయే పరిస్ధితి వచ్చి ఉండవచ్చు..! తద్వారా తాను ఎక్కడ నుంచి ఇక్కడకు వచ్చాను అన్న ఆనవాళ్ళు లేకుండా పోయివుంటుంది. మిగిలిన కొద్ది మంది ఆ పాత ఆధారాలను కోల్పోవడంతో… లింక్ కట్ అయిపోయి ఉండవచ్చని ఒక వర్గం శాస్త్రవేత్తల విశ్వాసం. అయితే…. మనిషి వచ్చింది మార్స్ మీద నుంచేనని…, త్వరలోనే ఈ ఆనవాళ్ళని స్పష్టంగా గుర్తించగలుగుతామంటున్నారు ఆ శాస్త్రవేత్తలు. ప్రస్తుతం మార్స్ మీద రోవర్లు తిరుగుతున్నాయి. కొన్నేళ్లకు.. స్వయంగా మనిషి మార్స్ మీదకు వెళ్తాడు. అప్పటికి మార్స్‌కి మనిషికి ఉన్న సంబంధం తిరిగి కనుగొనగలుగుతామని ఆ శాస్త్రవేత్తల విశ్వాసం. కానీ.. మార్స్‌పై జీవం ఆనవాళ్లు ఉండివుండవచ్చని.. కానీ.. మనిషి పుట్టినిల్లు మాత్రం అది కాదంటున్నారు మరికొందరు శాస్త్రవేత్తలు.. ఈ నిజానిజాలు తేలాలంటే.. మార్స్‌పై.. మరిన్ని పరిశోధనలు చేయాలి.

Also Read:

Andhrapradesh: భార్యకు ప్రేమతో.. నిలువెత్తు చెక్క విగ్రహం.. వేదమంత్రాల సాక్షిగా ఇంట్లో ప్రతిష్ట

ఎదురీత ముందు.. విధిరాత ఎంత..?.. కష్టాల దిగమింగి.. కన్నీళ్లను చెరిపేసి.. మెకానిక్‌గా మహిళ జీవనపోరాటం