Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎదురీత ముందు.. విధిరాత ఎంత..?.. కష్టాల దిగమింగి.. కన్నీళ్లను చెరిపేసి.. మెకానిక్‌గా మహిళ జీవనపోరాటం

గుండె ధైర్యం ఉంటే ఎంత కష్టమైన పని అయిన చేయవచ్చు అని నిరూపిస్తుంది.. అంజనాపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి. అసలే పేద కుటుంబం..

ఎదురీత ముందు.. విధిరాత ఎంత..?.. కష్టాల దిగమింగి.. కన్నీళ్లను చెరిపేసి.. మెకానిక్‌గా మహిళ జీవనపోరాటం
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 25, 2021 | 8:59 PM

గుండె ధైర్యం ఉంటే ఎంత కష్టమైన పని అయిన చేయవచ్చు అని నిరూపిస్తుంది.. అంజనాపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి. అసలే పేద కుటుంబం.. ఇద్దరు చిన్నారులను బాగా చదివించాలనేది వారి లక్ష్యం.. ఇందుకోసం ఎంతో కష్టమైన పనులను కూడా ఇష్టంగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు..ఆదిలక్ష్మి, భద్రయ్య దంపతులు. భర్తకు చేదోడువాదోడుగా నిలుస్తూ…మెకానిక్‌ పనులు చేస్తున్న ఈ ఇల్లాలు అందర్నీ అబ్బురపరుస్తోంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్ మండల పరిధిలోని పాత అంజనాపురం గ్రామంలో నివసిస్తున్న ఆదిలక్ష్మి, భద్రయ్యలది నిరుపేద గిరిజన కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారు చాలా చిన్న పిల్లలు. వీరికి మంచి భవిష్యత్తు కల్పించడం కోసం దంపతులిరువురు కష్ట పడుతున్నారు. అన్ని పనుల్లో భర్తకు చేదోడువాదోడుగా ఉంటుంది ఆదిలక్ష్మి. కానీ, వీరిపట్ల విధి వక్రికరించింది… భర్త భద్రయ్య చేస్తున్న వెల్డింగ్ పనిలో భాగంగా తాను కూడా తోడుగా వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఆదిలక్ష్మి కంటిలో నిప్పురవ్వ పడింది. వైద్య ఖర్చు కోసం యాభై వేలకు తమ ఇంటిని తాకట్టు పెట్టారు. కుటుంబ పోషణ కోసం పొట్ట చేత పట్టుకుని ఉంటున్న పల్లెను వదిలి పొరుగున ఉన్న సుజాత నగర్ మండల కేంద్రానికి చేరుకున్నారు.

నేషనల్ హైవే పక్కన పంచర్ మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసుకుని దుర్భరమైన జీవనం సాగిస్తున్నారు. తాను కష్టాలకు కృంగి పోకుండా, ఆత్మ విశ్వాసంతో ఒక గిరిజన మహిళ పంచర్ మెకానిక్ అయింది. మెకానిక్ షెడ్ వారికి నివాసమైంది. భర్తకు తోడుగా నిలిచిన ఆదిలక్ష్మీ. భారీ వాహనాలకు, మోటర్ సైకిల్స్ టైర్లకు పంచర్ వేయడం, గ్రీస్ పెడుతూ ఆత్మస్థైర్యాన్ని చాటుకుంటుంది. కేవలం పురుషులు మాత్రమే చేయగలిగే పనిగా భావించే ఈపనిని…అందులోనూ ఎంతో శారీరక శ్రమతో కూడిన పనులు చేస్తోంది ఆదిలక్ష్మి..ఈ కుటుంబానికి దాతలేవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నారు.

తమ ఇద్దరు పిల్లల భవిష్యత్ కోసం, తాకట్టులో ఉన్న ఇంటిని విడిపించుకోవాలనే తపనతోనే ఈ పనిచేస్తున్నాని, ఆత్మ గౌరవంతో జీవితం గడపాలనే ఎంతకష్టమైనా తన భర్త చేస్తున్న పనులు చేస్తున్నానని గర్వంగా తెలిపింది ఆదిలక్ష్మి. తమ మెకానిక్‌ షెడ్‌ కోసం దాతలు చేస్తే.. తమకు ఆసరాగా ఉంటుందని కోరతున్నారు. చిన్న చిన్న సమస్యలకే కుంగి పోతున్న నేటి పరిస్థితుల్లో ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటున్న ఆదిలక్ష్మి లాంటి వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Also Read:

డిజిటల్ మీడియా, ఓటీటీపై కేంద్రం కళ్లెం.. హద్దుమీరితే కఠిన చర్యలు.. పిల్లలు చూడకుండా నియంత్రణ.. ఫోటో స్టోరీ

Ex Minister Raghuveera Reddy: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను శాసించిన వ్యక్తి.. ఇప్పుడు ఇలా.. వైరలవుతున్న ఫోటోలు

Andhrapradesh: భార్యకు ప్రేమతో.. నిలువెత్తు చెక్క విగ్రహం.. వేదమంత్రాల సాక్షిగా ఇంట్లో ప్రతిష్ట