AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Translator jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టులో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు.. తెలుగులో ఎన్ని ఖాళీలున్నాయంటే..?

Supreme court jobs: నిరుద్యోగులకు సుప్రీంకోర్టు శుభవార్త అందించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు అధికారులు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. 30 ట్రాన్స్‌లేటర్..

Translator jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టులో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు.. తెలుగులో ఎన్ని ఖాళీలున్నాయంటే..?
Supreme Court
Shaik Madar Saheb
|

Updated on: Feb 25, 2021 | 8:36 PM

Share

Supreme court jobs: నిరుద్యోగులకు సుప్రీంకోర్టు శుభవార్త అందించింది. దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉద్యోగాల్ని భర్తీ చేసేందుకు సుప్రీంకోర్టు అధికారులు నోటిఫికేషన్‌ను జారీ చేశారు. 30 ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ స్థానిక భాషలకు సంబంధించి ఈ ట్రాన్స్ లేటర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుందని.. సుప్రీంకోర్టు నోటిఫికేషన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతీయ భాషల్లో ట్రాన్స్‌లేటింగ్ సామర్ధ్యముంటే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చ్ 13 లోగా దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

అయితే.. ఎంపికైన అభ్యర్ధులు కోర్టులిచ్చిన తీర్పుల్ని ఇంగ్లీషు నుంచి ప్రాంతీయ భాషల్లోకి అనువాదం (ట్రాన్స్‌లేట్) చేయాల్సి ఉంటుంది. హిందీ అనువాదానికి సంబంధించి 5 పోస్టులు, అస్సామీ, 2, బెంగాలీ, 2, తెలుగు 2, గుజరాతీ 2, ఉర్దూ 2, మరాఠీ 2, తమిళం 2, కన్నడ 2, మళయాళం 2 , మణిపురి 2, ఒడిశా 2, పంజాబీ 2, నేపాలీ 1 పోస్టులు  ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్ధులు సంబంధిత భాషలల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీంతోపాటు ట్రాన్స్‌లేషన్‌లో సర్టిఫికేట్ లేదా డిప్లొమా కోర్సు పూర్తిచేసి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉండాలి. ముందుగా అభ్యర్ధులు సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి.. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిఉంటుంది. అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

జనరల్ కేటగరీ అభ్యర్ధులకు 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్ధులకు 250 రూపాయలు ఫీజు ఉంటుంది. మరిన్ని వివరాల కోసం సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను చూడండి.

Also Read:

Nirav Modi: లండన్ వీధుల్లో తిరిగిన నీరవ్ మోడీ, ఇక ఇండియాకు రాక తప్పదు, త్వరలో అప్పగింతకు సన్నాహాలు

WhatsApp can be banned: కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు.. దేశంలో వాట్సప్ బ్యాన్ అవుతుందా?.. కీలక విషయాలు తెలుసుకోండి..

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో