- Telugu News Photo Gallery Cinema photos Govt sets new rules for ott platforms social media messaging services
డిజిటల్ మీడియా, ఓటీటీపై కేంద్రం కళ్లెం.. హద్దుమీరితే కఠిన చర్యలు.. పిల్లలు చూడకుండా నియంత్రణ.. ఫోటో స్టోరీ
OTT New Rules: ఓటీటీ, డిజిటల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఈమేరకు కఠిన చర్యలు చేపట్టింది.
Updated on: Feb 25, 2021 | 5:14 PM

ఓటీటీ, డిజిటల్ మీడియాకు కేంద్రం మార్గదర్శకాలు తీసుకొచ్చింది. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఈమేరకు కఠిన చర్యలు చేపట్టింది.

సోషల్ మీడియాపై ఫిర్యాదులను 15 రోజుల్లో పరిష్కరించాలని స్పష్టం చేసింది. చీఫ్ కంప్లయిన్స్ ఆఫీసర్, నోడల్ అధికారి, రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారిని ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ఓటీటీల కోసం మూడంచెల విధానం తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఓటీటీ, డిజిటల్ మీడియాకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని, తమ వివరాలను మాత్రం వెల్లడించాలని ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు.

ఓటీటీ, డిజిటల్ మీడియాకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని, తమ వివరాలను మాత్రం వెల్లడించాలని పేర్కొన్నారు.

ఎలాంటి సామాజిక మాధ్యమాన్ని అయినా భారత్లో స్వాగతిస్తామని.. కానీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తే ఉపేక్షించేది లేదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.

ఓటీటీలను పిల్లలు చూడకుండా నియంత్రించే సదుపాయం ఉండాలని అభిప్రాయపడ్డారు





























