Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊహ తెలియని వయసులోనే స్టార్‌డమ్, ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే అనంతలోకాలకు పయనం.. దివ్యభారతి జయంతి ఈరోజు..

అందాల నటి దివ్య భారతి మరణం కోట్లాది మంది అభిమానులను విషాదంలోకి నెట్టింది. 19 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల తార మరణం ఓ మిస్టరీగా మారింది.

Rajitha Chanti

|

Updated on: Feb 25, 2021 | 3:51 PM

అందాల నటి దివ్య భారతి మరణం కోట్లాది మంది అభిమానులను విషాదంలోకి నెట్టింది. 19 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల తార మరణం ఓ మిస్టరీగా మారింది. ఊహ తెలియని వయసులోనే స్టార్‌డమ్, ప్రపంచాన్ని అర్థం చేసుకునేలోపే అనంతలోకాలకు పయనం.. వెరసి, అభిమానులకు తీరని శోకాన్ని మిగిల్చిందామె. నేలపై నడిచినప్పుడే ఆమెను స్టార్‌ అన్నారంతా.. నింగికెగిశాక అనకుండా ఉండగలరా..? కానీ, ఆ స్టార్‌డమ్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే వెళ్లిపోయింది టీనేజ్‌ స్టార్‌ దివ్యభారతి. ఈరోజు అందాల నటి దివ్యభారతి 47వ జయంతి. దివ్యభారతి అరుదైన ఫోటోలు..

1 / 4
దివంగత హీరోయిన్ దివ్యభారతి ఫిబ్రవరి 25, 1974న  జన్మించింది. దివ్యభారతి ఉత్తరాది నుంచి తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఈమెను ప్రముఖ నిర్మాత రామానాయుడు తన సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం బొబ్బిలి రాజాతో పరిచయం చేసారు.

2 / 4
 ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ అనతి కాలంలోనే టాప్ హీరోయిన్‎గా కోనసాగింది.  తెలుగు తమిళ భాషాల్లో కొన్ని హిట్ సినిమాల్లో నటించిన తర్వాత దివ్యభారతి 1992 లో విశ్వాత్మ అనే సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. ఓ దశలో దివ్యభారతి ఎంత బిజీగా ఉందంటే.. 1992 -93 మధ్యలో సుమారు 14 సినిమాల్లో నటించింది.

3 / 4
అదే సమయంలో దివ్యభారతి మే 10 న 1992 లో సాజిద్ నడియాడ్‌వాలాను పెళ్లి చేసుకుంది. వివాహా జీవితంలో సంవత్సరానికే అంటే ఏప్రిల్ 5, 1993 లో 19 ఏళ్ళ వయసులో అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే ఇప్పటికీ ఆమె మృతికి గల సరైన కారణాలు లేవని.. ఆమె మృతి పట్ల చాలా అనుమానాలు ఉన్నాయని అంటుంటారు.

4 / 4
Follow us