1/5

నిన్న, మొన్నటి వరకు ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన నాయకుడు ఇటీవల జరిగిన చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో సాధారణ వ్యక్తిగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
2/5

అత్యంత సాధారణ వ్యక్తిలా కనిపించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయనెవరో కాదు, ఎన్.రఘువీరారెడ్డి!. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయన కీలక నేతగా వ్యవహరించారు
3/5

పంచాయతీ ఎన్నికల్లో ఆయన ఓ పాత మోపెడ్ వాహనంపై తన భార్య సునీతను ఎక్కించుకుని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు
4/5

గతంలో కూడా వ్యవసాయ పనుల్లో భాగంగా డ్రాక్టర్‌తో మాగాణిలో దమ్ము చేస్తూ కనిపించారు. మరొసారి చెరువుకు గండి పడితే..దాన్ని పూడ్చేందుకు ఇసుక బస్తాలు మోశారు.
5/5

వ్యవసాయ బావిలో ఈత కొడుతున్న వీడియో, ఫోటోలు కూడా గతంలో వైరలయ్యాయి. రఘువీరా రాష్ట్ర విభజన అనంతరం సైలెంటయ్యారు