MLC K. Kavitha: ఎమ్మెల్సీ కవిత క్యాన్వాయ్‌లో ప్రమాదం..
మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కే. కవిత కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. గురువారం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. అయితే ఎమ్మెల్సీ కవిత సురక్షితంగా ఉన్నారని..
Updated on: Feb 25, 2021 | 7:22 PM

మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కే. కవిత కాన్వాయ్ ప్రమాదానికి గురైంది

గురువారం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత కాన్వాయ్‌లోని మూడు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి.

అయితే ఎమ్మెల్సీ కవిత సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కొండగట్టు నుంచి రాయికల్ వెళ్లే క్రమంలో మల్యాల మండలంలోని రాజారాం గ్రామం దగ్గర కవిత ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ముందుకారు అదుపు తప్పింది.

ఈ క్రమంలో ఒకేసారి బ్రెకులు వేయడంతో వెనకగా వస్తున్న ఐదు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ కవితతోపాటు.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కార్లు ఒకదానికొకటి ఢీకొని స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ఆ తర్వాత వేరే కారులో కవిత బయలుదేరి వెళ్లారు. కవితకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో పార్టీ నాయకులు, అభిమానులు అంతా ఊపిరిపీల్చుకున్నారు.





























