పెళ్లి వేడుకలో ఆ వరుడి చేసిన పనికి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఇంతకు ఏం జరిగిందంటే..

భారత్‌లో హెలికాప్టర్‌కు క్రేజ్‌ పెరిగిపోయింది. చిన్న పెద్ద, పేద ధనిక అన్న తేడా లేకుండా.. ఎర్ర బస్సు ఎక్కినంత ఈజీగా.. హెలికాప్టర్‌ను రెంట్‌కు తీసుకుంటున్నారు జనం. తాజాగా ఓ వ్యక్తి..తన వివాహ వేడుకకు సంబంధించిన బరాత్ కోసం హెలికాప్టర్‌ను రంగంలోకి దించాడు.

  • Rajeev Rayala
  • Publish Date - 10:23 pm, Thu, 25 February 21
పెళ్లి వేడుకలో ఆ వరుడి చేసిన పనికి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఇంతకు ఏం జరిగిందంటే..

Viral : భారత్‌లో హెలికాప్టర్‌కు క్రేజ్‌ పెరిగిపోయింది. చిన్న పెద్ద, పేద ధనిక అన్న తేడా లేకుండా.. ఎర్ర బస్సు ఎక్కినంత ఈజీగా.. హెలికాప్టర్‌ను రెంట్‌కు తీసుకుంటున్నారు జనం. తాజాగా ఓ వ్యక్తి..తన వివాహ వేడుకకు సంబంధించిన బరాత్ కోసం హెలికాప్టర్‌ను రంగంలోకి దించాడు.

రాజస్తాన్‌లోని షేఖావతిలో ఈ నయా వివాహ వేడుక చోటు చేసుకుంది. రతన్ గఢ్, తహసీల్ లో ఓ చిన్న గ్రామానికి చెందిన కోటీశ్వరుడు తన కుమారుడి కోరిక మేరకు ‘బరాత్’ వేడుక కోసం హెలికాప్టర్ ని రంగంలోకి దించాడు. వివాహం పూర్తైన వెంటనే కొత్త జంట బరాత్‌ వేడుక కోసం హెలికాప్టర్‌లో ఎక్కి ఊరేగింది. ఈ తతంగాన్ని రిపోర్ట్ చేయడం కోసం ఓ జర్నలిస్ట్ ని కూడా నియమించుకున్నాడు ఆ పెళ్లి కొడుకు తండ్రి.

ఆ రిపోర్టర్ కూడా తన క్రియేటివిటీని బాగా ఉపయోగించాడు. వివాహం జరగుతున్న చోట ఉన్న పరిస్థితులు, వధువు రియాక్షన్, వరుడి రియాక్షన్.. లాంటి విషయాలన్నీ పూస గుచ్చినట్లు రిపోర్డ్‌ చేశాడు. కుమారుడి సంతోషషం కోసం ఓ తండ్రి చేసిన ప్రయత్నం అనే కామెంటరీతో ప్రారంభమయ్యే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కాగా గతంలో కుడా ఓ వ్యక్తి పాలు అమ్మడానికి ఇబ్బంది అవుతుందని ఏకంగా హెలికాప్టర్‌ను కొన్నాడు. దానిని పాలవ్యాపారానికి వాడుకొని హాట్ టాపిక్ గా నిలిచాడు. ఆతర్వాత ఈ మధ్య సర్పంచ్ గా గెలించిన ఓ వక్తి ప్రమాణ స్వీకారానికి హెలికాప్టర్‌ను బుక్ చేసుకున్నాడు. దర్జాగా ఆ హెలికాప్టర్‌లో ఊరిలోకి ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Drishyam 2 : ‘దృశ్యం 2’ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంకీ కథలో మార్పులు చేస్తున్న దర్శకుడు జీతు జోసెఫ్..