Hair protection: జుట్టు రాలిపోవడం, తెల్లబడటం జరుగుతుందా?.. ఇలా చేసి అద్భుతమైన జుట్టును పొందండి..!

Hair protection: ముఖానికి మరింత అందం తీసుకువచ్చేది జుట్టు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి ఒక్కరూ ముదురు, మందపాటి జుట్టును ఇష్టపడతారు.

Hair protection: జుట్టు రాలిపోవడం, తెల్లబడటం జరుగుతుందా?.. ఇలా చేసి అద్భుతమైన జుట్టును పొందండి..!
Follow us

|

Updated on: Feb 26, 2021 | 7:36 AM

Hair protection: ముఖానికి మరింత అందం తీసుకువచ్చేది జుట్టు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి ఒక్కరూ ముదురు, మందపాటి జుట్టును ఇష్టపడతారు. మనిషి వ్యక్తిత్వాన్ని పెంచడానికి జుట్టు పనిచేస్తుంది. కానీ బిజీ జీవనశైలి కారణంగా జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం కొంచెం కష్టం. ఈ కారణంగా జుట్టు పొడిబారడం, చుండ్రు, జుట్టు రాలడం, తెల్లగా మారడం వంటి సమస్యలు సర్వ సాధారణమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఏమి చేయాలి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ ప్రశ్నకు మన పెద్దలు చెప్పే చిట్కా ఇదే.

నువ్వుల నూనె జుట్టుకు చాలా మేలు చేస్తుంది. సాధారణ నూనె వేయడం ఇష్టపడని వారు నల్ల నువ్వులను ఉపయోగించవచ్చు. నువ్వులలో మెగ్నీషియం, ప్రోటీన్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఒమేగా -3 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జుట్టుకు నువ్వుల నూనె ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నల్ల నువ్వులను ఈ విధంగా వాడండి.. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా మందికి నూనె రాయడం ఇష్టం ఉండదు. కారణం చెమటలు పట్టడంతో జుట్టుకు నూనే కాస్తా మొహానికి అంటుంది. దాంతో మొహం అంతా జిడ్డుగా మారుతుంది. రాత్రి వేళలో నూనె పెట్టుకుంటే మంచిది.

జుట్టు తెల్లగా మారుతుందా? మీ జుట్టు తెల్లగా మారుతున్నట్లయితే నువ్వుల పొడిగా చేసి.. నువ్వుల ఆకుల కషాయాన్ని తయారు చేసి జుట్టుకు అప్లై చేయాలి. ఫలితంగా మీ జుట్టును తెల్లగా మారకుండా సంరక్షిస్తుంది.

చుండ్రు బాధిస్తోందా? చుండ్రు వదిలించుకోవడానికి నువ్వుల పువ్వులు, ఆవగింజలను సమాన పరిమాణంలో రుబ్బుకోవాలి. తరువాత ఈ పేస్ట్‌లో నూనె, తేనె కలపండి. ఈ పేస్ట్‌ను హెయిర్ మాస్క్‌గా అప్లై చేయాలి. దాదాపు గంట సేపు ఉంచి.. ఆ తరువాత షాంపూతో కడగాల్సి ఉంది.

పొడవాటి, మందపాటి జుట్టు కోసం.. మీ జుట్టు నల్లగా, పొడవాటి మందంగా మారాలని మీరు కోరుకుంటే తామర కుంకుమ, గూస్బెర్రీలను నల్ల నువ్వులతో సమానంగా రుబ్బుకోవాలి. అలా వచ్చిన పేస్ట్‌లో కాస్త తేనెని కలపాలి. ఈ పేస్ట్‌ను హెయిర్ మాస్క్‌గా అప్లై చేసి కాసేపటి తరువాత షాంపూతో కడగాలి.

హెయిర్ షైన్ పెంచడానికి.. కఠినమైన, నిర్జీవమైన జట్టుు ఎవరూ ఇష్టపడరు. అందుకే జుట్టు ప్రకాశవంతంగా కనిపించేలా ఉండాలంటే.. వారానికి రెండు రోజులు నిద్రపోయే ముందు జుట్టు మూలాల్లో నువ్వుల నూనెతో బాగా మసాజ్ చేయండి.

Also read:

విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..

ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర అనుమానాస్పద కారు.. పెను కలకలం రేపిన పేలుడు పదార్థాలు..