విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..

Rowdy Sheeter Murder : స్నేహితుల మధ్య మొదలైన గొడవ చివరకు ప్రాణాలు తీసేవరకు వచ్చింది. విశాఖ జిల్లా మద్దిలపాలెం సమీపంలోని నక్కవానిపాలెం

విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..
Follow us
uppula Raju

|

Updated on: Feb 25, 2021 | 10:49 PM

Rowdy Sheeter Murder : స్నేహితుల మధ్య మొదలైన గొడవ చివరకు ప్రాణాలు తీసేవరకు వచ్చింది. విశాఖ జిల్లా మద్దిలపాలెం సమీపంలోని నక్కవానిపాలెం వద్ద రౌడీ షీటర్‌ వెంకట్‌రెడ్డి అలియాస్‌ బండ రెడ్డి హత్య కేసును పోలీసులు ఛేధించారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా హత్యకు సంబంధించి పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

‘‘హత్యకు గురైన రౌడీ షీటర్‌ వెంకట్‌రెడ్డి అలియాస్‌ బండ రెడ్డి, పీఆండ్‌టీ కాలనీకి చెందిన కె.శివసంతోష్‌రాజా స్నేహితులు. వీరిద్దరూ రెండు హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారు. గతకొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు రావడంతో దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత ఇద్దరూ వేర్వేరుగా కొంతమంది యువకులతో కలిసి దందాలు నిర్వహిస్తున్నారు. ఒక యువతి విషయంలో సంతోష్‌రాజాకు సన్నిహితుడైన పల్లా అనిల్‌ కుమార్‌ని కొట్టి, పద్ధతి మార్చుకోవాలని.. లేదంటే చంపేస్తానని వెంకట్‌రెడ్డి హెచ్చరించాడు. అనిల్‌కు హెచ్‌బీ కాలనీకి చెందిన దుర్గాప్రసాద్‌ అలియాస్‌ దుర్గా అనే స్నేహితుడు ఉన్నాడు. దుర్గాప్రసాద్‌కు స్నేహితుడైన మహేష్‌, వెంకట్‌రెడ్డికి సన్నిహితుడైన హేమంత్‌కు మధ్య గొడవ జరిగిన విషయాన్ని తెలుసుకున్న వెంకట్‌రెడ్డి‌.. దుర్గాప్రసాద్, అనిల్‌ను పిలిచి మరోసారి హెచ్చరించాడు. బిక్కవోలుకు చెందిన ఒక మహిళతో సంతోష్‌రాజాకు వివాహేతర సంబంధం ఉంది. వెంకట్‌రెడ్డి సన్నిహితుడైన హేమంత్‌ కూడా ఆమెతో సన్నిహితంగా ఉండటాన్ని తెలుసుకున్న రాజా అతడిని హెచ్చరించాడు. తనకు సన్నిహితుడైన హేమంత్‌ను హెచ్చరించటంతో వెంకట్‌రెడ్డి, సంతోష్‌రాజా మధ్య గొడవలు మొదలయ్యాయి.

అన్ని విషయాల్లోనూ తనకు అడ్డుగా నిలుస్తుండటంతో బండరెడ్డిని హత్య చేయాలని సంతోష్‌రాజా పథకం వేశాడు. తన అనుచరులు పి.అనిల్‌కుమార్, ఎస్‌.దుర్గాప్రసాద్, తెడ్డు రాజు, ఎం.మోహనరావు, బి.ఉమామహేష్‌తో కలిసి హత్యకు పథకం వేశాడు. ఈ నెల 23న రాత్రి 8.30 గంటల సమయంలో బండరెడ్డి నివాస పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. ఆ సమయంలో బండరెడ్డి పిల్లలతో ఆడుకుంటూ ఉండటం, తన వెంట ఎవరూ లేకపోవటంతో ఇదే అదునుగా భావించి రాడ్లు, తల్వార్, మటన్‌ కత్తితో దాడికి పాల్పడ్డారు. తలపై బలంగా మోదడంతో బండరెడ్డి కిందపడ్డారు. అనంతరం కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తలపై గట్టిగా కొట్టడంతో తీవ్రరక్తస్రావం అయి బండరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. హత్య అనంతరం వీరంతా ఆటోలో అక్కడ నుంచి వెళ్లిపోయి ఒక కారులో విజయనగరం, అనకాపల్లి, ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు. సమాచారం అందుకున్న ఎంవీపీ పోలీసులు వీరిని జూపార్కుకు సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన తల్వార్, రెండు ఇనుప రాడ్లు, ఒక కత్తి, కారును స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ప్రణాళిక రచించిన సంతోష్‌రాజాను అతడి ఇంటి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.

Viral News: నాటకంలో ఓవర్‌గా ఇన్వాల్వ్ అయ్యాడు.. సహపాత్రదారిని చంపబోయాడు.. చివరికి