AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర అనుమానాస్పద కారు.. పెను కలకలం రేపిన పేలుడు పదార్థాలు..

Mukesh Ambani: ముంబైలోని గామ్‌దేవి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం కార్మిచీల్ రోడ్డులో అనుమానాస్పద వాహనాన్ని గుర్తించారు.

Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఇంటి దగ్గర అనుమానాస్పద కారు.. పెను కలకలం రేపిన పేలుడు పదార్థాలు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 25, 2021 | 10:32 PM

Mukesh Ambani: ముంబైలోని గామ్‌దేవి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం కార్మిచీల్ రోడ్డులో అనుమానాస్పద వాహనాన్ని గుర్తించారు. ఈ వాహనంపై స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. హుటాహుటి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాహనం ఉన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. వాహనం లోపల జెలిటిన్‌ను గుర్తించారు. ఇది ఒక రకమైన పేలుడు పదార్థం కాగా, అది ఇంకా మాంటేజ్ కాలేదు. ఇదిలాఉంటే.. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇల్లు పేలుడు పదార్థాలు దొరికిన ప్రదేశానికి చాలా దగ్గరగా ఉంది. దాంతో ఈ సంఘటన చోటు చేసుకున్నప్పటి నుంచి ముఖేష్ అంబానీ ఇంటి బయట భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇది గుర్తు తెలియని వ్యక్తులు కావాలని బెదిరించడానికే ఇలాంటి ప్రయత్నం చేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ముంబై పోలీసులకు ముందుగా సమాచారం లభించింది. దాంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తరువాత వారు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. స్థానిక డిసిపి, ఎసిపిలతో పాటు బాంబు స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అనుమానాస్పదంగా ఆగి ఉన్న కారు లోపల నుంచి పేలుడు పదార్థాలను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం కారును సీజ్ చేశారు పోలీసులు. అయితే, ఈ కారులో ఒక లేఖ దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన నాలుగు బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ముఖేష్ అంబానీ ఇంటి పరిసరాల్లో ఉన్న సిసిటివి ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

ముఖేష్ అంబానీ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం.. పేలుడు పదార్థులు బయటపడిన నేపథ్యంలో ముఖేష్ అంబానీ కుటుంబానికి భద్రత పెంచుతామని మహారాష్ట్ర హోంమంత్రి శంభురాజ్ దేశాయ్ తెలిపారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించామన్నారు. అధికారులు ఈ ఘటనకు కారకులనే తేల్చే పనిలో ఉన్నారని, పేలుడు పదార్థాలు పెట్టిన వారిని తప్పకుండా పట్టుకుంటామని తెలిపారు. కాగా, ఇప్పటికే ముఖేష్ అంబానీ ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్త్‌ని ఏర్పాటు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఆ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆపి మరీ విచారిస్తున్నారు.

Also read:

Kolkata: మ్యాన్‌హోల్‌లో చిక్కుకున్న పారిశుధ్య కార్మికులు.. నలుగురు మృతి..

పెళ్లి వేడుకలో ఆ వరుడి చేసిన పనికి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ఇంతకు ఏం జరిగిందంటే..