Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves: ‘కరివేపాకు’ను అలా తీసిపారేయకండి.. ఎన్నో రోగాలకు దివ్య ఔషధం.. ఎందుకో తెలుసా..?

Benefits of Curry Leaves : చాలా మంది.. కరివేపాకులా అలా తీసిపారేయకండి అంటూ.. సంభోదిస్తుంటారు. విషయాలకు అనుగుణంగా కరివేపాకు పదాన్ని అలా సింపుల్‌గా వాడుతుంటారు. కానీ కరివేపాకు గురించి.. దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలిస్తే..

Curry Leaves: ‘కరివేపాకు’ను అలా తీసిపారేయకండి.. ఎన్నో రోగాలకు దివ్య ఔషధం.. ఎందుకో తెలుసా..?
Follow us
Shaik Madar Saheb

| Edited By: Shiva Prajapati

Updated on: Feb 26, 2021 | 7:37 AM

Benefits of Curry Leaves : చాలా మంది.. కరివేపాకులా అలా తీసిపారేయకండి అంటూ.. సంభోదిస్తుంటారు. విషయాలకు అనుగుణంగా కరివేపాకు పదాన్ని అలా సింపుల్‌గా వాడుతుంటారు. కానీ కరివేపాకు గురించి.. దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలిస్తే.. ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టడం మాత్రం ఖాయం. ఎందుకంటే.. కరివేపాకు లభించడం మన అదృష్టం అనుకోవచ్చు. ఎందుకంటే అది వంటలకు రుచి, సువాసన ఇవ్వడమే కాదు. దానిని రోజూ ఆహార పదార్థాల్లో వాడితే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ కలుగుతాయి. కానీ మనవాళ్లంతా కరివేపాకును ఆహారంలో ఉపయోగిస్తారు కానీ.. తినరు. అయితే కరివేపాకును ఆహారపదార్థాల్లో వాడటమే కాదు కచ్చితంగా తినాలని పేర్కొంటున్నారు నిపుణులు. కావున కరివేపాకులో ఉన్న ఔషధాల గురించి.. తింటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో కాల్షియం, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు సహా అనేక ఔషధ గుణాలున్నాయి. కరివేపాకు జుట్టు, చర్మానికి మంచిది. కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

బరువు తగ్గడానికి దివ్వఔషధం.. మీరు బరువు తగ్గాలనుకుంటే.. ప్రతిరోజూ పరిగడుపున ఉడికించిన కరివేపాకు నీటిని తాగాలి. గ్లాసు నీటిలో 20 కరివేపాకు రెమ్మలు వేసి మరిగించాలి. చేదుగా అనిపిస్తే.. రుచిగా ఉండటానికి కొంచెం తేనె, నిమ్మరసం కలిపి తాగవచ్చు.

నోటి పూతకు.. మీరు పదేపదే నోటిలోపల బొబ్బలు రావడం, పూతపూయడం లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. కరివేపాకులో తేనె కలపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని నోటి పూత, బొబ్బలపై పూయడం ద్వారా 2-3 రోజుల్లో ఉపశమనం లభిస్తుంది.

డయాబెటిస్.. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.. కరివేపాకులో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. దీంతోపాటు ఇది జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోదు. కరివేపాకు రోజూ తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది. రోజూ 8 నుంచి 10 కరివేపాకు రెమ్మలు తినాలి.. లేకపోతే వాటి రసం చేసుకోని తాగాలి.

జుట్టు రాలకుండా.. అందరూ స్టైల్‌గా ఉండానికి జుట్టు కీలకపాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టు రాలడం సర్వసాధారణమైంది. ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే.. కొబ్బరి నూనెలో కరివేపాకు, ఉసిరి కలిపి ఉడికించాలి. నూనె రంగు నల్లగా మారే వరకు ఉడికించిన తరువాత.. చల్లార్చి వడబోయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్లల్లో పూయాలి. ఆ తరువాత రోజు షాంపూతో తల స్నానం చేస్తే ఇట్టే మీ సమస్య మాయమవుతుంది.

Also Read:

బరువు తగ్గాలని డైటింగ్ చేస్తున్నారా..అయితే ఒక్కసారి ఇది చదవండి.. లేకపోతే చాలా సమస్యలు ఎదురుకోవాల్సి వస్తుంది..

మానసిక ఒత్తిడికి గురవుతున్నారా ? వీటిని రోజూవారీ డైట్‏లో తీసుకోవడం వలన ఆందోళన తగ్గిస్తాయి.. అవెంటంటే..